శనగపిండి: రెండు కప్పులు, చక్కెర: రెండు కప్పులు, యాలకుల పొడి: ఒక టీస్పూన్, బాదం, జీడిపప్పు, కిస్మిస్: పావు కప్పు, నెయ్యి: పావు కప్పు, నూనె: వేయించడానికి సరిపడా.
ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని, తగినన్ని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, నూనెపోసి.. వేడయ్యాక శనగపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బూందీ గరిటెలో పోస్తూ.. బూందీ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద మరో గిన్నె పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుని అదే గిన్నెలో చక్కెర, అర గ్లాసు నీళ్లు పోసి ముదురుపాకం పట్టాలి. పాకం రాగానే యాలకుల పొడి, బూందీ, వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. చల్లారకముందే చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి.