వంటింట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే పదార్థాలు ఉల్లిపాయలు, ఆలుగడ్డలే! అందుకే, తక్కువ ధరలో దొరికినప్పుడు వీటిని ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. అయితే, వాటిని నిల్వ చేసేటప్పుడు కొన్ని చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. దాంతో అవి త్వరగా పాడైపోతుంటాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాల్సిందే!