భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి సరిగ్గా 75 ఏండ్లు పూర్తవుతాయి. స్వతంత్ర భారతదేశ పాలన కోసం తగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ ఏర్పడింది. ఈ సభలో మొత్తం 299 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలకు ప్రాతినిధ్యం లభించింది. వీరంతా స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో తమదైన ముద్రవేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు పరిమితమైన హక్కులు ఉన్న సమయంలో రాజ్యాంగ సభలో ఈ 15 మంది సభ్యులు పురుషులతోపాటు మహిళలకూ సమాన హక్కుల కోసం గొంతెత్తారు.
కేరళ రాష్ట్రం పాల్ఘాట్ జిల్లాలో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు. 1946లో మద్రాస్ ప్రావిన్సు నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల గురించి విస్తృతంగా చర్చించారు. 1952లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సర ప్రారంభోత్సవం నాడు ‘మదర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యారు.
రాజ్యాంగ సభకు ఎన్నికైన ఏకైక దళిత మహిళ. డాక్టర్ అంబేద్కర్‌తో షెడ్యూల్డ్ కులాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారు. రాజ్యాంగంలో వికేంద్రీకరణ నియమాల గురించి అంబేద్కర్‌తో చర్చించారు.
పంజాబ్ రాష్ట్రం మాలేర్‌కోట్లలో జన్మించారు. యునైటెడ్ ప్రావిన్సెస్ (ఇప్పటి ఉత్తరప్రదేశ్) నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. సభలో ఏకైక ముస్లిం మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. రిజర్వేషన్లు, మైనారిటీ హక్కులు, ఆస్తి హక్కు మొదలైన అంశాల్లో రాజ్యాంగ సభ చర్చల్లో పాల్గొన్నారు.
రాజమండ్రిలో జన్మించారు. స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. జాతీయ భాష, మానవ అక్రమ రవాణా, స్వతంత్ర న్యాయవ్యవస్థ మొదలైన విషయాల్లో రాజ్యాంగ సభ చర్చల్లో తనదైన ముద్రవేశారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ప్రణాళిక సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. విద్య, సమాజ సంక్షేమ రంగాల్లో సేవలకుగాను పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.
గుజరాత్‌కు చెందిన హంసా మెహతా ఇంగ్లాండ్‌లో జర్నలిజం, సామాజిక శాస్త్రం చదువుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. బొంబాయి ప్రావిన్సు నుంచి రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ సభలో మహిళల హక్కులు, రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చలు జరిపారు. 1950లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం తొలి ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పద్మభూషణ్ పురస్కారం అందుకొన్నారు.
లక్నోలో జన్మించిన కమల 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. 1946లో రాజ్యాంగ సభకు యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి ఎన్నికయ్యారు. 1962లో హాపుర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రముఖ రచయిత్రి.
అస్సాంకు చెందిన లీలా రాయ్ 1923లో స్నేహితులతో కలిసి దీపాలి సంఘ అనే సంస్థను స్థాపించారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. దేశ విభజనకు నిరసనగా తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మహిళల కోసం జయశ్రీ పత్రికను స్థాపించి, దానికి సంపాదకురాలిగా వ్యవహరించారు.
తూర్పు బెంగాల్ (బంగ్లాదేశ్)లో జన్మించారు. 1921లో తన 16వ ఏటనే రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లో చేరారు. స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఒడిశాలో రైతాంగ పోరాటంలో భాగమయ్యారు. జమీందారి వ్యవస్థ రద్దుకోసం కృషిచేశారు. ఒడిశా నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. కానీ, తర్వాత తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఉత్తరప్రదేశ్ అలహాబాద్ జాతీయ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. రాజ్యాంగ సభలో ప్రవేశిక, రాజ్యసభ సభ్యుల అర్హతలు, ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు అరెస్టు) మొదలైన అంశాల గురించి చర్చించారు.
మహాత్మాగాంధీ కార్యదర్శిగా 16 సంవత్సరాలు పనిచేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలని, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు. ఫలితంగా 1956లో ఢిల్లీలో ఎయిమ్స్ ఏర్పాటైంది. యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. రాజ్యాంగంలో ఉమ్మడి పౌర స్మృతి, అందరికీ ఓటు, మతపరమైన హక్కులకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి ఆరోగ్యశాఖా మంత్రి అమృత్ కౌర్ కావడం గమనార్హం.
భారతీయ ఆంగ్ల కవయిత్రి అయిన సరోజినీ నాయుడు ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. హైదరాబాద్‌లో జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ స్త్రీ సరోజినీ నాయుడు కావడం విశేషం. బీహార్ నుంచి రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ సభలో జాతీయ పతాకం విషయంలో ఏర్పాటైన ఉపసంఘంలో సభ్యురాలిగా ఉన్నారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో బీఏ చదువుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. మహిళల హక్కులు, మైనారిటీల విషయాలు మొదలైన వాటి గురించి రాజ్యాంగ సభలో తన గళం వినిపించారు. 1957 నుంచి 1967 వరకు మాల్డా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
హర్యానా రాష్ట్రం అంబాలా పట్టణంలో జన్మించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యారు. యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. జాతీయ పతాకం కోసం ఏర్పాటైన ఉపసంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎంగా పని చేశారు. దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సొదరి. 1937 1939 యునైటెడ్ ప్రావిన్సెస్ విధానసభకు ఎన్నికయ్యారు. స్థానిక సంస్థలు, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. భారతదేశంలో మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచిపోయారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు కూడా విజయలక్ష్మి పండిట్ కావడం గమనార్హం.
కేరళలో స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. భారతదేశంలో సంస్థానాల విలీనం కోసం కృషిచేసిన నాయకులలో ఆమె ఒకరు. కొచ్చిన్ ట్రావెన్కూర్ సంస్థానం తరఫున రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. సమాఖ్య వ్యవస్థ గురించి రాజ్యాంగ సభలో మాట్లాడారు. 1952 ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.
– సుజాత వేమూరి