చుక్కలు-మొక్కులు
ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని పిలుస్తారు. పొలాలు పచ్చగా పండాలని ఈ రోజు రైతులు పూజలు చేస్తారు. ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ. మంచి సంతానం కలగాలని, పిల్లలు వృద్ధిలోకి రావాలని, భర్త క్షేమంగా ఉండాలని కోరుతూ ముత్తయిదువలు గౌరీదేవిని వ్రతంతో పూజిస్తారు. పెండ్లి కాని యువతులు మంచి వరుణ్ని కోరుతూ అమ్మవారిని దీపస్తంభం వ్రతంతో పూజిస్తారు. వ్రతం చేసేవాళ్లు సూర్యాస్తమయం వరకు నిష్ఠగా ఉపవాసం ఉంటారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు
చుక్కల అమావాస్య అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
– జె.జ్ఞానప్రసూన. నిజాంపేట
ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని పిలుస్తారు. పొలాలు పచ్చగా పండాలని ఈ రోజు రైతులు పూజలు చేస్తారు. ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ. మంచి సంతానం కలగాలని, పిల్లలు వృద్ధిలోకి రావాలని, భర్త క్షేమంగా ఉండాలని కోరుతూ ముత్తయిదువలు గౌరీదేవిని వ్రతంతో పూజిస్తారు. పెండ్లి కాని యువతులు మంచి వరుణ్ని కోరుతూ అమ్మవారిని దీపస్తంభం వ్రతంతో పూజిస్తారు. వ్రతం చేసేవాళ్లు సూర్యాస్తమయం వరకు నిష్ఠగా ఉపవాసం ఉంటారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
దీపస్తంభాన్ని నిలిపి, దీపాలను వెలిగించి, ఆ వెలుగులో గౌరీదేవిని పూజించడం వ్రత నియమం. వ్రతం మొదటిసారి నిర్వహిస్తున్న వాళ్లు పాలు, చక్కెర కలిపి చేసిన వరిపిండితో వంద చుక్కల వంటివి అమ్మవారి సన్నిధిలో పెట్టి, వందపోగుల హారాన్ని ధరిస్తారు. వంద సున్నపు చుక్కలతో దీపస్తంభాన్ని అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం వాటి సంఖ్యను పెంచుతూ ఐదేండ్లపాటు వ్రతాన్ని నిర్వహిస్తారు. చివరగా వెండితోగాని, బంగారంతోగాని చేసిన చుక్కలను దానంగా ఇచ్చి ఉద్యాపన చేసి, వ్రత సమాప్తి చేయాలని స్కాంద పురాణం చెబుతున్నది. దీపస్తంభానికి చుక్కలు పెట్టి పూజించే అమావాస్య కావడంతో, దీనికి చుక్కల అమావాస్య అనే పేరు వాడుకలోకి వచ్చింది.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- culture
- prominence
- telugu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

