తొమ్మిది రోజులు బతుకమ్మకు పెట్టే ప్రసాదాల్లో నవధాన్యాలు వచ్చేట్టుగా చూడాలంటారు. అటుకుల రూపంలో బియ్యం, ముద్దపప్పులో కందులు, పెసరపప్పు నివేదిస్తారు. ఇలా సమర్పించే నైవేద్యాలు ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తాయి.
అట్ల బతుకమ్మ సందర్భంగా పెసర్లు, బియ్యంతో చేసిన అట్లు నివేదిస్తారు. సాధారణంగా అట్లు ఎక్కువగా మినుములతో చేసుకుంటారు. మినుముల్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. బలవర్ధకమైన ఆహారమే అయినా ఎక్కువగా వాడితే బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. పెసర్లు జీర్ణశక్తిని పెంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. అందుకే తెలంగాణలో అట్ల బతుకమ్మ సందర్భంగా పెసరపప్పుతో చేసిన అట్లను నైవేద్యంగా పెడుతారు.
డా॥ ఆర్.కమల