తన అద్భుతమైన గళంతో మనల్ని మంత్రముగ్ధులను చేసే సునిధి చౌహాన్.. ఇప్పుడు తన ఫిట్నెస్తో ఫిదా చేస్తున్నది. ఈతరం అమ్మాయిలకు ఫిట్‌నెస్‌పై ఆసక్తి కలిగించేలా తన ఇన్‌స్టాగ్రామ్‌ని మార్చేసింది. సునిధి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఆమె ఫాలోవర్స్‌కు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ సింగర్ తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫొటో అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇందులో బ్లాక్ కలర్ బ్రాలెట్, లూజ్ డెనిమి ప్యాంట్, ఫ్లిప్-ఫ్లాప్స్‌తో కనిపించింది సునిధి.
నడుము చుట్టూ బ్లూలైన్స్ వైట్ జాకెట్ కట్టేసుకుంది. వీటికన్నా ఆమె ఫాలోవర్స్‌ను ఆకర్షించింది మాత్రం సునిధి టన్డ్ ఫిజికే! ఆమె వాష్‌బోర్డ్ అబ్స్ ఇందులో స్పష్టంగా కనిపించాయి. ఈ లుక్ చూస్తుంటే.. 40 ఏండ్లు దాటిన సునిధి ఎంత ఫిట్‌గా ఉందో అర్థమైంది. ఫిట్నెస్ అంటే అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా అని చాటి చెప్పింది. అతివలు కూడా ఎంత ైస్టెలిష్‌గా, ఫిట్‌గా ఉండొచ్చో తన లుక్‌తో ప్రూవ్ చేసింది. వ్యాయామం, సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే.. ఏ వయసులోనైనా ఫిట్‌గా ఉండొచ్చు అని చెప్పకనే చెబుతున్నది సునిధి.