సినీ పరిశ్రమ అంటేనే పుకార్లకు నిలయం. ఎప్పుడు ఎవరితో ఎవరికి లింకు పెట్టి రాస్తారో కూడా తెలియని పరిస్థితి. ఈ విషయంలో బాధితులైన తారలు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్న టాపిక్ ధనుష్, మృణాళ్ఠాగూర్లదే. ఎయిర్పోర్టుల్లోనూ, వేడుకల్లోనూ అనుకోకుండా వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి ప్రేమను సోషల్ మీడియా ఖరారు చేసింది. ధనుష్, మృణాళ్ ప్రేమలో ఉన్నారనీ, వాలెంటైన్స్ డే రోజున పెళ్లితో ఒకటి కాబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతున్నది.
దీనిపై తాజాగా మృణాళ్ స్పందించింది. ‘అసలు ఈ పెళ్లి రూమర్స్ ఎలా మొదలయ్యాయో.. ఎక్కడి నుంచి స్టార్టయ్యాయో అర్థంకావడం లేదు. నిజానికి ఇది పచ్చి అబద్దం. ఎవరైతే ఈ పెళ్లి వార్తను నిజమని నమ్మారో, వాళ్లకి ఈ నెల 14న రాబోతున్న వాలెంటైన్స్ డే, ఏప్రిల్ 1 లాంటిది. వారందరూ ఫూల్సే’ అంటూ అసలు నిజాన్ని చెప్పింది మృణాళ్ఠాగూర్.