ఈ సమ్మర్లో చల్లగా ఈ ప్లేస్‌లు తిరిగి వచ్చేయండి !!
Summer Vacation | రొటీన్ లైఫ్‌తో విసిగిపోతున్నారా! ఎక్కడికైనా వెళ్లి నాలుగు రోజులు సేదతీరాలని భావిస్తున్నారా! ‘మండుటెండల్లో విహారం ఏమిటి?’ అంటారా? ఎండలకు మంగళం పాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే పర్యాటక కేంద్రాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అక్కడి ప్రశాంతతకు ప్రత్యేక పండుగలూ తోడైతే.. ఆ విహారం సకల వినోదాల సమాహారంగా మారుతుంది. ఎందుకు ఆలస్యం చల్లటి వేడుక చేసుకుందాం!!

సిమ్లా హమ్లా చేద్దాం!
సమ్మర్ డెస్టినేషన్‌గా పేరున్న హిమాచల్ రాజధాని సిమ్లా వేసవి వినోదానికి ఆహ్వానం పలుకుతున్నది. బ్రిటిష్ పాలకులు సిమ్లాను వేసవి రాజధానిగా ఎంచుకున్నారు. భానుడి తాపం నుంచి ఉపశమనం కోరుతూ సిమ్లాకు మకాం మార్చేవారు. అలా సిమ్లా వేసవి విడిదిగా స్థిరపడింది. ఈ వాడుకకు మరింత ఉత్సాహాన్నిస్తూ ప్రతి వేసవిలో వేడుక నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. జూన్ 1 నుంచి 9 వరకు తొమ్మిది రోజులు సిమ్లా సమ్మర్ ఫెస్టివల్ జరుగుతుంది. స్థానికులే ఈ పండుగను నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా వీధివీధినా సంగీత కచేరీలు, పూల ప్రదర్శనలు, ఆటలు కొనసాగుతాయి. ఇందులో పాలుపంచుకోవడానికి దేశం నలుమూలల నుంచీ పర్యాటకులు సిమ్లాను హమ్లా చేస్తారు.

ఊటీలో పోటాపోటీగా..
ఎండలు మండే మేలో చల్లదనాన్ని కోరుకునేవారి తొలి మజిలీ ఊటీ. తమిళనాడులోని నీలగిరి పర్వత శ్రేణుల్లో కుదురుగా ఒదిగిపోయిన ఊటీని పర్యాటకులు భూతల స్వర్గంగా భావిస్తారు. యాత్రికులను మరింత ఆకర్షించడానికి ఏటా మేలో 16 రోజులపాటు ఊటీ ఫెస్టివల్ నిర్వహిస్తారు. 121 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రకరకాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఊటీ సరస్సులో పడవ పందేలు ఆకట్టుకుంటాయి. ఫెస్టివల్ తేదీలు అధికారికంగా ప్రకటించకపోయినా, మే చివర్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
పూలపండక్కి సిక్కిం చెక్కేద్దాం
సిక్కింలో మే నెలంతా పూల పండుగే. రాజధాని గ్యాంగ్‌టక్ ఇందుకు వేదికగా నిలుస్తుంది. కనీవినీ ఎరుగని పుష్ప జాతులను ఇక్కడ చూడొచ్చు. దీనికితోడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ, ఎండలను మర్చిపోవచ్చు. మే 1న మొదలైన అంతర్జాతీయ పూల పండుగ 31 వరకు కొనసాగుతుంది.

సాగా దావా@ లద్దాఖ్
భారతావనిలో బౌద్ధ ధర్మానికి చిరునామా లద్దాఖ్. ఈ పర్యాటక కేంద్రానికి వేసవిలో జనం క్యూ కడతారు. లద్దాఖ్‌లో జరిగే ‘సాగా దావా’ ఉత్సవం చూడముచ్చటగా ఉంటుంది. బౌద్ధుల సంప్రదాయ వేడుకైన ‘సాగా దావా’ జూన్ 14న జరుగనుంది. వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో కళాకారులు ప్రదర్శించే చామ్ డ్యాన్స్ (మాస్క్ నృత్యం) చూసేవారిని కట్టిపడేస్తుంది.
Read More :
“Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి”
చలిగిలిలో.. ప్రకృతి ఒడిలో.. హనీమూన్ ట్రిప్స్‌కు పెరిగిన డిమాండ్”
“హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలను మీరెప్పుడైనా చూశారా..?”
ప్రపంచాన్ని చుట్టేయాలనుకునే మహిళల కోసమే ఈ సర్వీసులు.. మీరు లుక్కేయండి”
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

