Tourism Spot Goa | సమ్మర్ వెకేషన్‌కు గోవా వెళ్తున్నారా? అక్కడ తక్కువ ధరలో దొరికే లగ్జరీ విల్లాలు ఇవే..
Summer Vacation Tourism Spot Goa | సమ్మర్ వెకేషన్‌కు గోవా వెళ్తున్నారా? పసిడి అందాల ఇసుక, ధగధగ మెరిసే నీలి జలాలు.. పచ్చ పచ్చని వరి పొలాలు, ఒంపు సొంపుల కొబ్బరిచెట్లు.. ఇండో-పోర్చ్‌గీస్ వాస్తులో నిర్మించిన అతిథి గృహాలు మనకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఏ విడిది బాగుంటుంది? ఎంత చార్జ్ చేస్తారు? వాటి ప్రత్యేకతలు ఏమిటి? తదితర వివరాలు మీ కోసం..

ఆర్కో ఐరిస్ బొటిక్ హోమ్‌స్టే
గోవాలోని కర్టోరిమ్లో ఉందీ రెండువందల ఏండ్లనాటి పోర్చుగీసు కట్టడం. మొత్తం 1.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. జువారీ నదికి కూతవేటు దూరం. పోర్చుగీసు భాషలో ఆర్కోఐరిస్ అంటే ‘ఇంద్ర ధనస్సు’ అని అర్థం. పేరుకు తగినట్టే రంగురంగుల్లో ఐదు విశాలమైన గదులు ఉన్నాయి. ఒక రాత్రి బస చేయడానికి రూ.6000కు పైగా చార్జ్ చేస్తారు.

కాపెల్లా ఫారెస్ట్ రిట్రీట్
శివార్లలోని గ్రామీణ ప్రాంతంలో ఉంది. కొండపై మూడు గదులతో నిర్మించారు. కుటుంబంతో వచ్చేవారికి మంచి హోమ్‌స్టే స్పాట్. విలాసవంతమైన ఈ భవంతి పచ్చదనానికి చిరునామా. ప్రకృతిని ప్రేమించేవారికి సరైన ఎంపిక. ఇక్కడి నుంచి ఐదు నిమిషాల్లో వివిధ బీచ్‌లకు వెళ్లొచ్చు. కాపెల్లాలో స్టే చేయడానికి ఒక రాత్రికి రూ.5000 చెల్లించాలి.

కాసా మెనెజస్
గోవా రాజధాని పంజిమ్ నుంచి 13 కిలో మీటర్లు. చుట్టూ పచ్చదనం ఆవరించి ఉంటుంది. ‘డిమెనెజెస్’ కుటుంబానికి చెందిన 300 ఏండ్లనాటి ఇల్లు ఇది. టేకు, ఓక్, రోజ్‌వుడ్‌తో తీర్చిదిద్దిన ఇంటీరియర్స్ దీని ప్రత్యేకత. ఒక పూటకు రూ. 6000 చార్జ్ చేస్తారు.

పెరీరాస్ గోవన్ విల్లా
వాస్కోడగామాలోని పెరారీస్ గోవన్ విల్లా ఓ సొగసైన కట్టడం. గోవా, భారతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయి.

ఓ అబ్రిగో
పంజిమ్‌లో ఇంకా మిగిలి ఉన్న కొన్ని పాత భవంతులలో ఇదొకటి. అడుగడుగునా కళాఖండాలే. హైస్పీడ్ వైఫై, ఇతర సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కరాత్రి ఉండాలంటే రూ. 3,200 చార్జ్ చేస్తారు.

బెర్తాస్ రివర్వ్యూ
ఉత్తర గోవాలోని రెండు వందల సంవత్సరాలనాటి ఇల్లు ఇది. సరదాగా చేపలు పట్టాలనుకునేవారికి ఓ మంచి అవకాశం. స్టే చేయాలంటే పూటకు రూ. 2,200 చెల్లించాలి.

కాన్సియోస్ హౌస్
ఈ ఇల్లు ఉత్తర గోవాలోని అల్డోనాలో ఉంది. 500 విశాలమైన గదులు, పురాతన ఫర్నిచర్ దీని ప్రత్యేకత. పక్కా గోవా వంటకాలు లభిస్తాయి.
ఇవే కాదు.. ఓలాలిమ్ బ్యాక్యార్డ్స్, మిస్ జెన్నీస్ హోమ్‌స్టే, మంగాళ్ ఫార్మ్‌స్టే, దూద్‌సాగర్ ఫామ్ స్టే, కాసా సుసేగడ్ – ప్రతి భవంతీ దేనికదే ప్రత్యేకం. అతిథులకు మరపురాని యాత్రానుభూతిని మిగులుస్తాయి.
Read More :
“ప్రపంచాన్ని చుట్టేయాలనుకునే మహిళల కోసమే ఈ సర్వీసులు.. మీరు లుక్కేయండి”
ఇప్పటికీ ఎయిర్‌పోర్ట్‌లు లేని దేశాలు ఉన్నాయని తెలుసా?”
అర్ధరాత్రైనా ఇక్కడ పగల్లాగే ఉంటుంది.. సూర్యుడు అస్తమించని ప్రాంతాలివే..”
Telangana Tourist places | తెలంగాణలో పర్యాటక ప్రాంతాలు”
“Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి”
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Goa
- Summer Vacation
- Tourism
- travel
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

