e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home జిందగీ ‘సౌందర్య’ విజయం!

‘సౌందర్య’ విజయం!

కరోనాతో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. కానీ, సౌందర్య ఉద్దీపన ఉత్పత్తులకు మాత్రం మార్కెట్‌ పెరిగింది. లాక్‌డౌన్‌ సమయాన్ని మగువలు చర్మ సంరక్షణకు ఉపయోగించుకోవడమే ఇందుకు కారణం. అప్పటికే బ్యూటీ మార్కెట్‌లో ఓ బ్రాండ్‌ సృష్టించిన ‘నైకా’ ఉత్పత్తులు ఈ వ్యవధిలో విరివిగా అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు రూ. 2,440 కోట్ల లాభాలు ఆర్జించిందీ సంస్థ. దీంతో నైకా షేర్ల విలువ అమాంతంగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 38శాతం వృద్ధిలోకి వచ్చింది నైకా. చిన్నస్థాయిలో ఆన్‌లైన్‌ వ్యాపారంగా ప్రారంభించి, కోట్ల టర్నోవర్‌కు తీసుకెళ్లారు సీయీవో ఫాల్గుణి నాయర్‌. ‘మంచి శిక్షణ, ఉన్నత విద్య, అండగా నిలిచేవారు… ఈ మూడు అంశాలూ ఏ స్త్రీని అయినా ఉన్నత పీఠం మీద కూర్చోబెడతాయి’ అంటారు ఫాల్గుణి. ఐఐఎం నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశాక, 19 ఏండ్ల పాటు కొటక్‌ మహీంద్రా గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా పనిచేశారు. తన 50వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేశారు. ‘నాకు మేకప్‌ అంటే చాలా ఇష్టం. అందుకే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లోకి బ్యూటీ ఉత్పత్తులను తీసుకొచ్చాను’ అని చెబుతారామె.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana