Bhavana Suresh | ఇల్లు ఎంత గొప్పగా కట్టినా, లోపలి ఫర్నిచర్ ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దినా… అడుగడుగునా కనిపించే వస్తువులు పొందికగా లేకపోతే వెలితిగా ఉంటుంది. అలా అని ఆందోళన చెందాల్సిన పన్లేదు. అందుకు కావల్సిన వస్తువులను ప్రత్యేకంగా అందించే ఓ సంస్థ ఉంది. అదే.. 10ClubHomes. ఫ్లవర్వాజులు, పిల్లో కవర్స్, వంట సామగ్రి, పిల్లల గది సరంజామా, పూజగది వస్తువులు.. ఇలా ఇంటి అవసరాలన్నిటినీ తీర్చే ప్రయత్నం చేస్తున్నది ఈ సంస్థ.
పెరటితోటకు, ఇంటి ఆవరణకు కావల్సిన వస్తువులు సైతం అందిస్తున్నది. ‘ఇంట్లోని ప్రతి గది మనసూ మాకు తెలుసు’ అంటారు 10ClubHomes వ్యవస్థాపకురాలు భావనా సురేశ్. కృత్రిమ మేధ, సొంత వెబ్సైట్ లాంటి వ్యవస్థలతో వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటున్నారు. భావన బెంగళూరులో చదువుకున్నారు. ఆ తర్వాత పారిస్లో ఫ్యాషన్ కోర్సు చేశారు. ఓ పెద్ద ఆటోమొబైల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కానీ, సొంత వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో.. అన్నీ వదిలేసుకుని, ఆంత్రప్రెన్యూర్ అవతారం ఎత్తారు.