ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించి బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి...
బూర్గంపహాడ్, ఆగస్టు 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించి బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి కల్పించడం జరుగుతుందని ఎస్ఐ మేడా ప్రసాద్ బుధవారం తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తిచేసి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులకు సెప్టెంబర్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని, ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత రెసిడెన్షియల్ సౌకర్యం కల్పిస్తూ పోలీస్ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. బూర్గంపహాడ్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని ఎస్ఐ కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

