Irumudi Movie | ‘ఇరుముడి’ ప్రదర్శన నిలిపివేత.. థియేటర్ ముందు ప్రేక్షకుల ధర్నా!
Irumudi Movie | నారాయణపేట జిల్లాకు చెందిన మక్తల్‌లో స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నారాయణపేట జిల్లా మక్తల్‌లో స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంతో ఆసక్తిగా తిలకించాలనుకున్న రవితేజ ‘ఇరుముడి’ చిత్రాన్ని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా నిలిపివేయడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రేక్షకులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ థియేటర్ గేటు ఎదురుగా బైఠాయించి పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.
గత రెండు రోజులుగా ఈ సినిమా కోసం జనం భారీగా పోటెత్తుతున్నారు. తమ సొంత పనులను సైతం పక్కన పెట్టి థియేటర్‌కు చేరుకుంటున్నప్పటికీ, టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని ప్రేక్షకులు వాపోయారు. కనీసం నేడైనా సినిమా చూసే అవకాశం ఉంటుందని ఆశతో వస్తే, ప్రదర్శన రద్దు చేశారన్న వార్త వారిని నిరుత్సాహానికి గురిచేసింది. అవసరమైతే నేలపై కూర్చుని లేదా నిలబడి అయినా సినిమా చూస్తామని, ఎంతటి రద్దీనైనా భరిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రజల ఆందోళనతో అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం మరియు నిర్వాహకులు తక్షణమే స్పందించి, సినిమా ప్రదర్శనను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అకస్మాత్తు పరిణామంతో స్థానికంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మక్తల్ వెంకటరమణ థియేటర్లో ఇరుముడి సినిమాను తీసేసారని ధర్నా pic.twitter.com/ANSDpyyQQt
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

