Sonam Kapoor | రొటీన్‌కు భిన్నంగా ఉండటం నాకు నచ్చదు: సోనమ్ కపూర్
అందరూ అనుకున్నట్టు రొటీన్‌కు భిన్నంగా ఉండటం తనకు నచ్చదు అంటున్నది బాలీవుడ్ భామ సోనమ్ కపూర్. డే టు డే లైఫ్ సాదాసీదాగా సాగిపోతేనే సహజంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తన రొటీన్ దినచర్య గురించి ఇలా పంచుకుంది..
Sonam Kapoor | అందరూ అనుకున్నట్టు రొటీన్‌కు భిన్నంగా ఉండటం తనకు నచ్చదు అంటున్నది బాలీవుడ్ భామ సోనమ్ కపూర్. డే టు డే లైఫ్ సాదాసీదాగా సాగిపోతేనే సహజంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తన రొటీన్ దినచర్య గురించి ఇలా పంచుకుంది..
ఏ రోజూ భిన్నంగా ఉండదు. మనం ప్రశాంతంగా ఉంటే.. ప్రతి ఉదయం హృదయాన్ని స్పందింపజేసేదే అవుతుంది. ఫ్రెష్‌గా నిద్రలేచి రెగ్యులర్ వర్కవుట్లు చేస్తాను. తర్వాత పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటా.
సౌందర్య సాధన చాలా అవసరం. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు అది తప్పనిసరి. ఆహార నియమాలు పక్కాగా పాటించాలి. కేశ సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తా. యాంటీ హెయిర్ ఫాల్ సీరమ్ రెగ్యులర్‌గా ఐప్లె చేస్తుంటా.
వాతావరణ కాలుష్యం, పని ఒత్తిడి ఇవన్నీ శారీరక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంటాయి. ముఖ్యంగా హెయిర్లాస్కు ఇవి ప్రధాన కారణం అవుతాయని నిపుణులు చెబుతుంటారు. వెంట్రుకల కుదుళ్లు బలంగా ఉండేందుకు పోషకాహారం చాలా అవసరం. అందుకే నా డైట్ ప్రత్యేకంగా ఉంటుంది. రుచుల కన్నా.. పోషకాలకే అధిక ప్రాధాన్యం ఇస్తా. అలాగని నోరేం కట్టుకోను.. రుచికరమైన పదార్థాలనూ ఆస్వాదిస్తా!