శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆశ్వయుజ అమావాస్య మంగళవారం తేది 25-10-2022 రోజున సాయంత్రం 04-59 నుంచి సాయంత్రం 5-48 వరకు కేతుగ్రస్త ముచ్యమాన అస్తమయ పాక్షిక సూర్యగ్రహణం. ఇది స్వాతి నక్షత్రం 1వ పాదం, తులా రాశిలో ఏర్పడుతున్నది. ఈ గ్రహణం భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6-08 అయినప్పటికీ, సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5-48 వరకే గ్రహణం కనిపిస్తుంది. కనుక ఈ గ్రహణాన్ని ముచ్యమాన అస్తమయ సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఈ గ్రహణం కృష్ణ వర్ణంలో కనబడుతుంది. పశ్చిమ నైరుతి సమీపంలో గ్రహణ స్పర్శ. పశ్చిమంలో గ్రహణ మోక్షం.
స్పర్శ కాలం : సా 4-59
మధ్యకాలం : సా 5-43
మోక్షకాలం : సా 6-08
గ్రహణ పర్వకాలం: 1-09 గంటలు (మొత్తం గ్రహణ సమయం)
గ్రహణ గోచారం: సింహం-వృషభం-మకరం-ధనుస్సు రాశులవారికి శుభప్రదం
కన్య-మేషం-కుంభం-మిథున రాశులవారికి మధ్యమం
తుల-కర్కాటకం-మీనం-వృశ్చిక రాశులవారికి అధమం
శ్రీ శుభకృత్ నామ సంవత్సర కార్తిక పౌర్ణమి మంగళవారం తేది 8-11-2022 రోజున సాయంత్రం 5-44 నుంచి సాయంత్రం 6-18 వరకు రాహుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం. ఇది భరణి నక్షత్రం 3వ పాదం, మేషరాశిలో ఏర్పడుతున్నది. ఈ గ్రహణం భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ రోజు సూర్యాస్తమయం సాయంత్రం 5-42. చంద్రోదయం సాయంత్రం 5-44. కనుక గ్రహణం సాయంత్రం 5-44 నుంచి మనకు కనిపిస్తుంది. తూర్పు సమీపంలో గ్రహణ స్పర్శ. ఈశాన్య సమీపాన గ్రహణ మోక్షం.
స్పర్శ కాలం : పగలు 2-40
సమ్మీలన కాలం: పగలు 3-47
మధ్యకాలం: సాయంత్రం 4-29
ఉన్మీలన కాలం: సాయంత్రం 5-11
గ్రహణ దృశ్య ప్రారంభ సమయం: సాయంత్రం 5-44
మోక్షకాలం: సాయంత్రం 6-18
గ్రహణ దృశ్య కాలం: 34 నిమిషాలు
గ్రహణ పూర్తి పర్వకాలం : 3-38 గంటలు
గ్రహణం కనబడు ప్రాంతాలు: ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది.
గ్రహణ గోచారం: కుంభం-వృశ్చికం-కర్కాటకం-మిథున రాశులవారికి శుభప్రదం
మీనం-ధనుస్సు-తుల-సింహ రాశులవారికి మధ్యమం
మేషం-మకరం-కన్య-వృషభ రాశులవారికి అధమం
సంక్షిప్త అక్షర వివరణ: సూ.ఉ- సూర్యోదయం, సూ.అ- సూర్యాస్తమయం, వ- వర్జ్యం,
పువ- పునర్ వర్జ్యం, పుదు- పునర్ దుర్ముహూర్తం, పుఅ- పునర్ అమృతకాలం, ల- లగాయతు, ఉ- ఉదయం, ప- పగలు, సా- సాయంత్రం, రా- రాత్రి, రాతె- రాత్రి తెల్లవారుజామున