మనిషి శరీరంలోని ప్రతి అవయవానికి క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే తల, శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణిస్తారు. పెదవులు, నోరు, చిగుళ్లు, నాలుక, నాసల్ క్యావిటీ, ఫారింక్స్, స్వరపేటిక వంటి భాగాలలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 90శాతం వరకు ఈ క్యాన్సర్లు ‘స్కామన్ సెల్ కార్సినోమా’ రకానికి చెందినవే. అంటే మ్యూకస్ ఉండి, ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదాలు, చిగుర్లు, నాలుక తదితర భాగాలలో ఈ క్యాన్సర్లను ఎక్కువగా కనిపిస్తాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్లు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల కిందకు రావు.
మద్యపానం, ధూమపానం వల్లనే :
ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణమైన మద్యపానం, ధూమపానం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కు కూడా దారితీస్తుంది. ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఈ రెండు అలవాట్లు ఉంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు అధికం. ధూమపానం, మద్యపానం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు వచ్చే అవకాశం 75శాతం వరకు ఉంటుంది.
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చే ప్రధాన భాగాలు :
లక్షణాలు :
నిర్ధారణ పరీక్షలు :
పై లక్షణాలు కనిపించినా లేక అనుమానం ఉన్నా బయాప్సీ, ఎంఆర్ఐ, సీటీ, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రొసీజర్తో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని, స్టేజ్ గ్రేడింగ్లను నిర్ధారిస్తారు.
చికిత్సా పద్ధతులు :
క్యాన్సర్ సోకిన భాగం, వ్యాధి ఉన్న దశ, రోగి వయస్సు, మెడికల్ హిస్టరీ ఆధారంగా చికిత్సా పద్ధతులు ఆధారపడి ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీతో పాటు కొన్ని రకాల సమ్మేళన థెరపీలను కూడా అవసరానికి అనుగుణంగా ఇస్తారు. తల, మెదడు వంటి సున్నితమైన భాగాలలో చికిత్సలు చేసినప్పుడు, వాటి పనితీరు, ముఖంలో అనేక మార్పులు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు గొంతులో మార్పు, నమలడానికి ఇబ్బందిపడటం, దవడ ఎముక పట్టేసినట్లు ఉండటం, మొద్దుబారినట్లుగా ఉండడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే తల, మెదడు వంటి చోట్ల అనుభజ్ఞులైన వైద్యులతోనే చికిత్స చేయించుకోవడం ఉత్తమం. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే స్టేజ్-1, స్టేజ్-2లో కూడా కేవలం సర్జరీతోనే వ్యాధిని శాశ్వతంగా నయం చేయవచ్చు. సర్జరీ తరువాత పునఃనిర్మాణ శస్త్రచికిత్స అవసరం ఎక్కువగా ఉంటుంది. స్టేజ్-3, 4లో ఉన్న రోగులకు కీమో, రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 3డీసీఆర్టీ, వీఎంఏటీ, ఐజీఆర్టీ, ఐజీకేటీ, బ్రాకీథెరపీ, భీమ్ థెరపీ, వంటి ఆధునిక పద్ధతులతో రేడియో థెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు. సాధారణంగా ఈ క్యాన్సర్లకు కీమో థెరపీ పాత్ర తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో కీమోను మిశ్రమ చికిత్సగా అందిస్తారు. ఉపశమనం కొరకు పాలియేటివ్ కేర్లోనూ ఉపయోగించడం జరుగుతుంది.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121