shakira pizza order | షకీరా గొంతు మిమిక్రీ చేస్తూ పిజ్జా ఆర్డర్ ఇచ్చిన యువతి.. ఆ తర్వాత ఏమైందంటే..

shakira pizza order | ఏదైనా ఆర్డర్ చేయాలంటే, మామూలుగా అయితే ఆ పదార్థం పేరు ప్రస్తావిస్తూ ఆర్డర్ ఇస్తాం. గాయకులైతే ట్యూన్ కట్టి, పాట రూపంలోనూ ఆర్డరిచ్చే అవకాశం ఉంది. మిమిక్రీ కూడా తెలిసి ఉంటే ఇంకొంత వైవిధ్యంగా చెప్పవచ్చు. గాయని శుభా వేదుల సరిగ్గా ఇలానే చేశారు. ప్రముఖ పాప్ సింగర్ షకీరా గొంతును అనుకరిస్తూ పిజ్జా ఆర్డర్ చేశారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అంతేకాదు, అది షకీరా దృష్టికీ వెళ్లడంతో.. “నీ ఆర్డర్ నేను తీసుకోవచ్చా” అంటూ ఆమె ట్విటర్ ద్వారా పలకరించారు. శుభ కూడా ఆనందంగా స్పందించారు. ఈ పిజ్జా కథకు ఓ నేపథ్యం ఉంది.
షకీరా స్వరాన్ని అనుకరిస్తూ ఓ పిజ్జా ఆర్డర్ ఇవ్వాల్సిందిగా అమెరికాలో ఉన్న ఓ మిత్రురాలు శుభను
సరదాగా అడిగారట. క్షణాల్లో ఆ పని చేశారు. అయితే, ఈ వీడియో అంత ప్రభావం చూపుతుందని మాత్రం అప్పట్లో అనుకోలేదు. అందుకే, దాదాపు రెండు నెలలు తన దగ్గరే పెట్టుకున్నారు. కానీ,
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దానికి 70 లక్షల వీక్షణలు వచ్చాయి. ఇప్పుడా సంఖ్య 2 కోట్లు దాటిపోయింది. ఇప్పటికీ తన వీడియో ట్రెండింగ్‌లో ఉందని గర్వంగా చెబుతారు శుభ. షకీరా అంతటి గాయని నుంచి స్పందన రావడం చాలా గొప్ప విషయమని మురిసిపోతారు. శుభ మూలాలు తెలుగు గడ్డ మీదే ఉన్నాయి. తను విశాఖ యువతి. తెలుగు రుచులన్నా, తెలుగు భాష అన్నా ప్రాణం. ఆ పిజ్జా వీడియోకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఫిదా అయిపోయారు. ఫోన్ చేసి ‘మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు?’ అని శుభను అడిగారట. అందుకు ఆమె సమాధానం.. ‘మీరే’.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
Ranu Mondal : యూట్యూబర్‌తో కలిసి చికెన్ కర్రీ వండిన రను మొండల్.. వీడియో వైరల్
సలసలాకాగే నూనెలో చేయి పెట్టి ఫ్రై చికెన్ తయారీ.. షాక్ అవుతున్న నెటిజన్లు
Petrol Pumps : పెట్రోల్ బంక్‌ల వద్ద సెల్‌ఫోన్స్ ఎందుకు వాడకూడదు? వాడితే ఏమౌతుంది?
King Cobra: పాడుబడ్డ బావిలో 12 అడుగుల రాచనాగు..!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- pizza
- pizza order
- shakira
- viral
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

