కావలసిన పదార్థాలు
బియ్యం: ఒక కప్పు, నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, ఎండు మిర్చి: నాలుగు, పచ్చిమిర్చి: మూడు, కరివేపాకు: రెండు రెబ్బలు, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, పల్లీలు, శనగపప్పు, మినుపపప్పు: ఒక టేబుల్‌స్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
బియ్యం కడిగి అరగంటపాటు నానబెట్టుకుని పొడిపొడిగా వండుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి సగం పల్లీలు, శనగపప్పు, మినుపపప్పు, నువ్వులు, ఎండుమిర్చి వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకుని అన్నంలో బాగా కలపాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నెయ్యి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, మినుపపప్పు, పచ్చిమిర్చి చీలికలు వేయించాలి. వేగిన పోపులో నువ్వులపొడి కలిపిన అన్నం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపితే ఘుమఘుమలాడే నువ్వులన్నం సిద్ధం.