సెల్ఫీలంటే ప్రాణాలిచ్చే రకం మనవాళ్లు. ఇక నుంచి సెల్ఫీల కోసం కొండలూ గుట్టలూ ఎక్కి రిస్క్ తీసుకోవాల్సిన పన్లేదు. సురక్షితమైన ప్రదేశంలో, అందమైన సెల్ఫీలు తీసుకునేందుకు .. హైదరాబాద్‌లో ఓ సెల్ఫీ మ్యూజియం ఏర్పాటు కానుంది. శామీర్‌పేట్‌లోని పంజాబీ హవేలీ దాబా సమీపంలో ‘ది హబ్’ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు రాహుల్ ఆనంద్, రోలీ దంపతులు. ఇందులో ఇరవైకి పైగా 3డీ సెల్ఫీ సెట్స్ ఉంటాయి. సెల్ఫీలు తీసుకునేవారి ఫొటోలు తీసేందుకు ప్రత్యేకంగా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లూ అందుబాటులో ఉంటారు. రంగురంగుల బాల్పిట్స్, బార్బీ బాక్సులు, 19వ శతాబ్దపు లండన్ టెలిఫోన్ బూత్, మిలియనీర్ బెడ్రూమ్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక బ్యాచ్‌లో పది మందినే అనుమతిస్తారు. అక్కడే బర్త్‌డే పార్టీలు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేసుకోవచ్చని చెబుతున్నారు నిర్వాహకులు.