Google Photos | ఒకటా.. రెండా.. వందలు వేలల్లో ఫొటోలు. గ్యాలరీలో టైమ్‌లైన్ ప్రకారం స్క్రోల్ చేస్తూ చూడటం అందరికీ అలవాటే. క్లౌడ్‌లో కంఫర్ట్‌గా చూద్దాం అనుకుంటే గూగుల్ ఫొటోస్ ఉండనే ఉంది. జీపీఎస్, ఇతర ఫొటో డిస్క్రిప్షన్స్తో ఎప్పటికప్పుడు ఫొటో ఆల్బమ్‌లను యానిమేట్ చేసి మనకు చూపిస్తుంది.
ఇంతలా దగ్గరైన గూగుల్ ఫొటోస్ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నది. అదే ‘ఆస్క్ ఫొటోస్’ ఫీచర్. ఇదో ఆర్టిఫిఫియల్ ఇంటిలిజెన్స్ సౌకర్యం. దీంతో గ్యాలరీల్లోని ఫొటోలను వెతికేందుకు కళ్లు కాయలు కాచేలా చూడనక్కర్లేదు. సింపుల్‌గా ‘వాయిస్ కమాండ్‌తో అడిగితే చాలు.. కావాల్సిన ఫొటోలు తెరపైకి వచ్చేస్తాయి. అంటే లైబ్రరీలోని ఫొటోలతో మనం మాట్లాడొచ్చు అన్నమాట.
ఏఐ మన కమాండ్స్‌ని ప్రాసెస్ చేసి అడిగిన ఫొటోలను అందిస్తుంది. ఉదాహరణకు.. గతేడాది దసరాకి అమ్మమ్మ వాళ్ల ఇంటిదగ్గర సరదాగా తీసుకున్న ఫొటోలు చూద్దాం అనుకున్నారు! వెంటనే వాయిస్ కమాండ్ రూపంలో ‘2023 దసరా ఫొటోస్ ఎట్ గ్రాండ్ మా హోమ్’ అని అడిగితే చాలు. అంతేకాదు ధరించిన దుస్తులు, యాక్టివిటీ, లొకేషన్.. లాంటి ఇతర వివరాలతో అడిగినా.. వాటి తాలూకూ ఫొటోలు వచ్చేస్తాయ్. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ రూపంలో పరిమిత యూజర్లకు అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లు ఫీచర్‌ని వాడుకోవచ్చు. గూగుల్ ఫొటోస్ యాప్‌లో ‘కొత్త ట్యాబ్’ మాదిరిగా ఈ ‘ఆస్క్ ఫొటోస్’ను ప్రవేశపెడుతున్నది గూగుల్. ఒక్కసారి ఈ కొత్తఫీచర్కి యాప్ అప్డేట్ అయ్యాక.. ఇప్పుడు కనిపిస్తున్న ‘సెర్చ్’ ట్యాబ్ ఇకపై కనిపించదు. అయినప్పటికీ సంప్రదాయ పద్ధతిలో ఫొటోల్ని సెర్చ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని గూగుల్ చెబుతున్నది. అయితే, వాయిస్ కమాండ్స్‌తో ఫొటోలు వెదికే క్రమంలో ఫొటోలను కరెక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చి తీరాలి. ఫొటోల్లో వారి పేర్లు, వారితో మీకున్న రిలేషన్ లాంటి వివరాల్ని పక్కాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఏఐతో మీ వాయిస్ కమాండ్స్ జతకడతాయి.