ఫోన్ కొనాలంటే ఎంతో అనాలసిస్ చేస్తున్నాం. పెర్ఫార్మెన్స్, స్టయిల్, సెక్యూరిటీ.. ఇలా అన్నీ ఓకే అనుకున్నాకే సెలెక్ట్ చేస్తున్నాం. యూజర్లకు అన్ని హంగులనూ అందించడానికి ఆల్ ఇన్ వన్ ఫీచర్స్‌తో ముస్తాబై ముందుకొచ్చింది సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్56 5జీ ఫోన్. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో సరికొత్త ఫీచర్లతో తయారైన ఈ మొబైల్ మందం కేవలం 7.2 మిల్లీమీటర్లు.
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో దీన్ని డిజైన్ చేశారు. ఎంత స్లిమ్‌గా ఉన్నా.. స్ట్రాంగ్‌గా ఉంటుందని తయారీదారుల మాట. ఇందులో 50MP OIS కెమెరా ఉంది. ఎలాంటి షేకింగ్ లేకుండా ఫొటోలు తీసే ఫీచర్ కూడా ఉంది. 4K 10-bit HDR వీడియోలు రికార్డ్ చేయొచ్చు. బిగ్ పిక్సెల్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్ ఇందులో ఉన్నాయి.
సెల్ఫీ లవర్స్ కోసం 12MP HDR ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంతకీ దీని డిస్ప్లే సైజు ఎంతంటే.. 6.7 అంగుళాలు. Super AMOLED+ 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ స్మూత్ ఉంటుంది. 8 జీబీ, 12 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఇలా రెండు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. యూజర్ ఫ్రెండ్లీగా వాడేందుకు నౌ బార్, కొత్త హోమ్ స్క్రీన్ డిజైన్, ట్యాప్ అండ్ పేతో సామ్సంగ్ వాలెట్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ నయా స్మార్ట్‌ఫోన్ ఫ్రారంభ ధర రూ.25,999.