మొబైల్ ఫోన్ల బాక్స్‌ల నుంచి చార్జర్లు, కేబుళ్లను తొలగించడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. దీనికి కంపెనీలు ‘పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాలు తగ్గించడం’ లాంటి కారణాలు చెబుతున్నా, అసలు విషయం వేరే ఉందని మార్కెట్ టాక్. వాస్తవానికి, ఇలా చేయడం వల్ల కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకుంటున్నాయి. ధర మాత్రం అలాగే ఉంచి, యాక్సెసరీలను కట్ చేయడం వల్ల లాభం పూర్తిగా వారికే దక్కుతున్నది. వినియోగదారుల దగ్గర పాత కేబుళ్లు, చార్జర్లు ఉన్నాయనే భావనతో కంపెనీలు కొత్త ఫోన్ల బాక్స్‌లలో వాటిని ఇవ్వడం మానేశాయి. అయితే, అన్ని కేబుళ్లు ఒకేలా పనిచేయవు. ఫోన్ మోడల్, చార్జింగ్ స్టాండర్డ్ ఆధారంగానే వేగం మారుతుంది. అందుకే పాత కేబుల్‌తో కొత్త ఫోన్ వేగంగా చార్జ్ అవుతుందని చెప్పలేం. సోనీ లాంటి సంస్థలు కేబుల్‌ను తీసేయడం లాంటి నిర్ణయాలు ఇతర పెద్ద బ్రాండ్లను కూడా ఇదే దారిలో నడిపించే అవకాశం ఉంది. త్వరలో యాపిల్, సామ్సంగ్ వంటి దిగ్గజాలు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే ఆశ్చర్యం లేదు. వినియోగదారుల కోణంలో చూస్తే.. బాక్స్‌లో వస్తువులు తగ్గిపోతున్నా, ధర మాత్రం పెరుగుతుండటం గమనార్హం.