శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి మూత్ర విసర్జన అనేది ఒక సాధారణ ప్రక్రియ. చలికాలంలో నీళ్లు తక్కువ తాగినా తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇలా ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడంతో చాలామంది ఆందోళన చెందుతుంటారు. పెరిగిన చలికి యూరిన్ పదే పదే వెళ్లాల్సి వస్తే ఎలాంటి ఆందోళన పడకుండా కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరి.
ఈ సీజన్లో వ్యాపించే చలిగాలుల కారణంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో పాటు మూత్రవిసర్జన చాలా మందిని వేధిస్తుంటుంది. రాత్రి సమయాల్లో మూడు నుంచి నాలుగు సార్లు మేలోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంటుంది. దీంతో అలసట, చిరాకు, మరుసటి రోజు ఏకాగ్రత లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. మూత్రపిండాలకు ఎకువ రక్తం ప్రవహించినప్పుడు, ఎకువ యూరిన్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా, మనం తరచుగా యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది.
శీతాకాలంలో తక్కువ చెమట వల్ల కూడా శరీరంలోని అదనపు నీరంతా మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంటుంది. ఈ శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతను మరింత తగ్గించే చల్లని నీటికి బదులు గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. మరికొందరు వెచ్చగా ఉండేందుకు టీ, కాఫీలు తాగుతుంటారు. వీటికి బదులు సాయంత్రం గోరువెచ్చని నీరు, సూప్ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై శరీరాన్ని వేడి చేసి, మూత్రవిసర్జనను తగ్గిస్తుంది. చాలామంది చలికాలంలో నీరు తకువ తాగుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. వాతావరణం ఎలా ఉన్న సరే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం.