సన్ గ్లాసెస్.. ఎండకాలంలో కళ్లకు రక్షణనిస్తాయి. ముఖానికి కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. మిమ్మల్ని మరింత స్టయిలిష్‌గా మారుస్తాయి. ఈ వేసవి కోసం ప్రఖ్యాత రేబాన్ సంస్థ.. సరికొత్త సన్ గ్లాసెస్‌ను మార్కెట్లో విడుదల చేసింది. నాణ్యత కలిగిన లెన్స్, మన్నికైన ఫ్రేమ్స్‌తోపాటు ఐకానిక్ డిజైన్లకు రేబాన్ ప్రసిద్ధి. ఫ్యాషన్‌తోపాటు బ్రాండింగ్‌ను ఇష్టపడేవారికి ఇవి మంచి ఎంపిక!
పాతతరం వైబ్ కావాలనుకునే కొత్తతరం కోసం.. రౌండ్ డబుల్ బ్రిడ్జ్ పేరుతో సన్ గ్లాసెస్ తీసుకొచ్చింది రేబాన్. సొగసైన మెటల్ ఫ్రేమ్‌తో తయారైన ఈ గ్లాసెస్.. ఎక్కువకాలం మన్నుతాయి. తేలికగా ఉండటంతో రోజంతా ధరించినా సౌకర్యంగా ఉంటాయి. యూవీ ప్రొటెక్షన్ కలిగిన లెన్స్.. మీ కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ట్రెండీ లుక్‌తో ఆకట్టుకునేలా ఉండే ఈ గ్లాసెస్.. మీరు ఎలాంటి దుస్తుల్లో ఉన్నా స్టయిలిష్‌గా కనిపించేలా చేస్తాయి.
క్లాసిక్ ఫ్యాషన్‌ను ఇష్టపడే వారికి ఫుల్ రిమ్ ఏవియేటర్స్ మంచి చాయిస్! రేబాన్ ఐకానిక్ డిజైన్‌తో దృఢమైన ఫ్రేమ్స్‌తో వస్తున్నాయివి. తేలికైన, మన్నికైన మెటల్ ఫ్రేమ్‌తో తయారైన ఈ ఏవియేటర్స్.. రోజంతా ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. యూవీ ప్రొటెక్షన్ కలిగిన లెన్స్‌లు.. కఠినమైన సూర్యకాంతి నుంచి కళ్లను రక్షిస్తాయి. మీ లుక్‌ను మరింత కూల్‌గా మారుస్తాయి.
సొగసైన అసిటేట్ ఫ్రేమ్‌తో.. మీ ముఖానికి స్టయిలిష్, ఫంక్షనల్ లుక్ తీసుకొస్తాయి రేబాన్ గ్రేడియంట్ స్కేర్ సన్ గ్లాసెస్. తేలికగా, సౌకర్యంగా ఉంటాయి. ఓవర్‌హెడ్ సూర్యరశ్మిని అడ్డుకోవడంలో సాయపడతాయి. డ్రైవింగ్‌ను ఇష్టపడేవారికి మంచి ఎంపిక. ఎలాంటి ఔట్ఫిట్లో ఉన్నా.. క్లాసిక్ వైబ్‌ను తీసుకొస్తాయి.