నేషనల్ క్రష్.. రష్మిక! ‘బ్లాక్‌బస్టర్ హిట్స్’ను సొంతం చేసుకుంటూ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ఒకవైపు తీరికలేకుండా సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందామె. తనకు సంబంధించిన తాజా ఫొటోలు, వీడియాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది.
తాజాగా, ప్రేమను పలురకాలుగా వ్యక్తం చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. వివిధ రకాలుగా లవ్ సింబల్స్ క్రియేట్ చేసి.. తన ఫ్యాన్స్‌పై తనకున్న ప్రేమనంతా వ్యక్తం చేసింది. ఒక్కో ఫ్రేమ్‌కు ఒక్కో లవ్ సింబల్ వచ్చేలా దిగిన ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘హృదయాన్ని లక్ష విధాలుగా తయారుచేయగలిగేది నేనొక్కదాన్నే!’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఓవైపు ఈ ఫొటోలు వైరల్ అవుతుండగానే.. మరోవైపు రష్మికకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టేస్తున్నది. తాను బీఏ చదువుతున్నడు ఇచ్చిన ఆడిషన్‌కు సంబంధించిన వీడియో అది. ముద్దుముద్దు మాటలు, ముచ్చటైన యాక్టింగ్‌తోపాటు అదిరిపోయే డ్యాన్స్‌తో ఉన్న ఈ వీడియో.. నెటిజన్లను తెగ అలరిస్తున్నది.
“హాయ్! నేను రష్మిక! వయసు 19. ఎత్తు 5.5. నేను బీఏ రెండో సంవత్సరం చదువుతున్నా!” అంటూ ఇంట్రో ఇచ్చిన రష్మిక.. ఆ తర్వాత ‘మాధురీ దీక్షిత్ ఆజ నాచ్లే!’ పాటపై స్టెప్పులేసింది. కన్నడలో కొన్ని డైలాగ్స్ చెప్పి అలరించింది. ‘పుష్ప-1’తోపాటు ‘యానిమల్’ చిత్రాలతో ఆలిండియా స్టార్ ర్యాంక్ కొట్టేసిన రష్మిక.. ప్రస్తుతం ‘పుష్ప-2’తో బిజీగా ఉన్నది.