‘ఫిట్నెస్’ అంటే.. రకుల్‌ప్రీత్ సింగ్‌కు మహా ప్రీతి. నిత్యం ఏవేవో కసరత్తులు చేస్తూ.. ‘ఫిట్నెస్ ఫ్రీక్’గా పేరు తెచ్చుకున్నది. తాజాగా, జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ గాయపడింది రకుల్. ఈక్రమంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటూ.. తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్‌మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చింది. ‘ఆరోగ్యమే మహాభాగ్యం. స్వేచ్ఛగా తిరుగుతున్నందుకు ఎంత కృతజ్ఞతతో ఉండాలో మనం తరచూ మర్చిపోతుంటాం!’ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది రకుల్‌ప్రీత్ సింగ్.
దానికి #LifeLearning హ్యాష్ట్యాగ్నూ జోడించింది. వివరాల్లోకి వెళ్తే.. జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ ఎలాంటి సేఫ్టీ బెల్ట్ ధరించకుండానే 80 కిలోల బరువును ఎత్తింది రకుల్. దాంతో ఆమె వెన్నెముకకు గాయమైంది. ఈ గాయాన్ని లైట్ తీసుకోవడంతో అదికాస్తా తిరగబెట్టింది. దాంతో వైద్యుల సూచన మేరకు ఇప్పుడు మంచానికే పరిమితమైంది. తాజాగా.. తన ఆరోగ్యంతోపాటు మరికొన్ని విషయాలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నది.
‘వెన్నునొప్పిని పట్టించుకోకుండా వ్యాయామం కొనసాగించా! దాంతో గాయం తీవ్రమై.. ఆరు రోజులుగా బెడ్‌పైనే ఉన్నా. నా శరీరం కంటే.. నా మనసే ఎంతో బలమైందని నమ్ముతున్నా. నాకు ఇదొక పాఠం. మీరుకూడా మీ శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోండి’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్. ఇటీవలే ‘భారతీయుడు 2’లో సందడి చేసిన ఈ సుందరి.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తున్నది.