శుక్రవారం 10 జూలై 2020
Zindagi - Jul 01, 2020 , 00:07:47

ప్రధానైనా ఆహ్వానం లేకుండానే వేడుకకు..?

ప్రధానైనా ఆహ్వానం లేకుండానే వేడుకకు..?

ఐఏఎస్‌ అధికారులు బీఎస్‌ యుగంధర్‌, వేణుగోపాల్‌ అంటే పీవీకి మంచి గురి ఉండేది. ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తరువాత ప్రత్యేకంగా వారిని ఎంచుకుని పలు కీలక బాధ్యతలను అప్పగించారు. వేణుగోపాల్‌ కూతురు అనుపమ  ప్రియదర్శినికి, యుగంధర్‌ కుమారుడు, ప్రస్తుత మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో పెళ్లి కుదిరింది. ఆ నిశ్చితార్థ కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించడంతో వేణుగోపాల్‌ ప్రధానిని ఆహ్వానించలేదు. అయినప్పటికీ అక్కడికి వెళ్లాలనుకున్నారు పీవీ. అంతే కాన్వయ్‌లో కాకుండా మరో అధికారి రామూ దామోదరన్‌ కారులో, కేవలం ఒక్క ఎస్కార్టు కారుతో బయలుదేరారు.  ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. అలా వెళ్లగా మధ్యలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు పీవీ. ప్రధానిగా అది ఆయనకు అసాధారణమైన అనుభవం. దానిపై మెత్తని పద్ధతిలో “నేను ట్రాఫిక్‌ ఎలా ఉంటున్నది మరిచిపోయాను” అంటూ చమత్కరించారు. logo