పవర్ఫుల్.. పర్పుల్ క్యారెట్
క్యారెట్స్‌లో నాలుగు రకాలు. ఒక్కో రకం ఒక్కో రంగులో ఉంటుంది. మన దగ్గర ఆరెంజ్ కలర్ క్యారెట్లే ఎక్కువ. ఇప్పుడిప్పుడే పర్పుల్ మెరుపులూ మెరుస్తున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అపారం. పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి
క్యారెట్స్‌లో నాలుగు రకాలు. ఒక్కో రకం ఒక్కో రంగులో ఉంటుంది. మన దగ్గర ఆరెంజ్ కలర్ క్యారెట్లే ఎక్కువ. ఇప్పుడిప్పుడే పర్పుల్ మెరుపులూ మెరుస్తున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అపారం. పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఆంథోసయనిన్లు అనే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో మహానగరాల జనం కోరికోరి పర్పుల్ క్యారెట్లను తెప్పించుకుంటున్నారు.
బరువు తగ్గడానికి…
పర్పుల్ క్యారెట్‌లోని ఫైబర్, ఆంథోసయనిన్లు బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడతాయి.
జీవక్రియల మెరుగుదలకు
జీవక్రియలు కుంటుపడితే మధుమేహం, అధిక రక్త పోటు వస్తాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి పర్పుల్ క్యారెట్ మేలు చేస్తుందని బ్రిటిష్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
కొలెస్ట్రాల్ తగ్గించడంలో
రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే గుణం ఈ క్యారెట్‌కు ఉంది. అలాగే రక్తంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే హైపర్లిపిడోమియా సమస్యనూ ఇవి సమర్థంగా అడ్డుకుంటాయి.
క్యాన్సర్ నియంత్రణలో
ఈ క్యారెట్లకు పేగు క్యాన్సర్లను నివారించే లక్షణం ఉందని గుర్తించారు. ఓ పరిశోధనలో భాగంగా.. కొన్ని ఎలుకలకు క్యాన్సర్ వ్యాధిని కలిగించే ఆహారం పెట్టారు. అందులో కొన్నిటికి పర్పుల్ క్యారెట్లు తినిపించారు, కొన్నిటికి తినిపించలేదు. అందులో పర్పుల్ క్యారెట్లు తిన్న ఎలుకలు క్యాన్సర్‌కు గురికాలేదు.
అల్జీమర్స్ చికిత్సలో
వృద్ధులను తీవ్రంగా వేధించే వ్యాధి.. అల్జీమర్స్. పెద్దలలో మతిమరుపు సమస్యను తగ్గించడానికి కూడా పర్పుల్ క్యారెట్స్ ఉపయోగపడతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

