జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడుక్కుంటే మొటిమల తీవ్రత తగ్గుతుంది.
జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడుక్కుంటే మొటిమల తీవ్రత తగ్గుతుంది.
నూనె వంటకాలు మొటిమలకు కారణం అవుతాయి. రెగ్యులర్ డైట్లో నూనె శాతం తగ్గించాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. నీళ్లు సమృద్ధిగా తాగాలి. రెగ్యులర్‌గా పండ్ల రసాలు తీసుకోవాలి.
డిప్రెషన్లో ఉన్నవారికి సైతం మొటిమలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధలు చెబుతున్నాయి. మానసికంగా సంతోషంగా ఉండాలి.
సాలిసిలిక్ ఆయిల్, టీట్రీ ఆయిల్ కలిగిన ఫేస్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. కలబంద జెల్‌తో కస్తూరి కలిపి ఫేస్‌ప్యాక్‌గా వేసుకున్నా మొటిమలను నియంత్రించవచ్చు.