కొత్తగా అమ్మ అయిన వాళ్లు ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం
Parental Tips | జీవితంలోకి పసిబిడ్డ రాగానే అమ్మ మనసులో వంద ఆలోచనలు. పాపాయి అవసరాలు తీర్చడమే కాదు, చక్కటి బంధాన్ని ఏర్పరచుకోవడమూ ముఖ్యమే. కొత్తగా అమ్మ అయినవాళ్లకు ఇదొక సవాలు. తల్లీబిడ్డల మధ్య చక్కటి అనుబంధానికి కొన్ని చిట్కాలు.
మనసారా పాలివ్వండి
తల్లీబిడ్డల బంధాన్ని బలోపేతం చేసే శక్తిమంతమైన మార్గం పాలుపట్టడం. స్తన్యం ద్వారా పాపాయి ఆరోగ్యంగా పెరగడమే కాదు, ఆ స్పర్శతో అమ్మకూ బిడ్డకూ మధ్య మంచి అను
బంధమూ ఏర్పడుతుంది. పాలు తాగేటప్పుడు పసిపిల్లలకు అమ్మ గుండె చప్పుడు వినిపిస్తుంది. కడుపులో ఉన్నప్పుడు వాళ్లకది సుపరిచితమైన శబ్దం. దీంతో ఎంతో భద్రంగా, సౌకర్యంగా ఫీలవుతారు. అమ్మను అంటిపెట్టుకుని ఉండటానికి ఇష్టపడతారు.

కళ్లలోకి చూడండి
పసిపిల్లలతో బలమైన అనుబంధం ఏర్పడాలంటే వాళ్ల కళ్లలోకి కళ్లు పెట్టి చూడాలి. ఉయ్యాల ఊపేటప్పుడు, పాలిచ్చేటప్పుడు, నలుగు పెట్టేప్పుడు… ఇలా ఏ సమయంలో అయినా వాళ్లను రెప్పవాల్చకుండా చూస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మెదళ్లకు సంబంధించిన తరంగాలు అనుసంధానం అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలు నవ్వేటప్పుడు నేరుగా చూస్తూ పలకరించడం వల్ల వాళ్లలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుందట. ఈ హార్మోన్‌ను లవ్ హార్మోన్ అని, బాండింగ్ హార్మోన్ అని పిలుస్తారు.
మాట్లాడుతూ ఉండండి
చంటిబిడ్డలు తిరిగి మాట్లాడలేరు కాబట్టి, వాళ్లతో మనం మాట్లాడటంలో అర్థంలేదని అనిపిస్తుంది, కానీ ఆ అభిప్రాయం నిజం కాదు. వాళ్లను పలకరిస్తూ, కబుర్లు చెబుతూ ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించి, భాషకు సంబంధించి పిల్లల్లో ఎదుగుదల వస్తుంది. ఏదైనా చదివి వినిపిస్తూ ఉన్నా కూడా ఈ రకమైన అభివృద్ధి ఎక్కువగా ఉంటుందట. పిల్లల మెదడు వికాసానికే కాదు, తల్లీబిడ్డల మధ్య చక్కటి అనుబంధం పెనవేసుకోవడానికి కూడా ఈ ప్రక్రియ ఉపకరిస్తుంది.
ఆరోగ్యం జాగ్రత్త
అమ్మకు, పాపాయికి మధ్య రాగానుబంధాలు చక్కగా ఉండాలంటే ముందు తల్లి ఆరోగ్యం బాగుండాలి. నిద్రలేమి, పనుల ఒత్తిడి, డిప్రెషన్లాంటివి ఉంటే బిడ్డతో సరిగ్గా గడపలేరు. అందుకే తల్లులు తమ ఆరోగ్యానికి, అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మాత్రమే పాపాయిని జాగ్రత్తగా చూసుకోగలరని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read More :
“మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? వాళ్లకు ఏం నేర్పిస్తున్నారు?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- child
- Mother
- parental tips
- Parents
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

