Twins Delivery | అరుదైన ఘటన.. మూడు రోజుల తేడాతో పుట్టిన కవలలు!
సాధారణంగా కవల పిల్లలు పుడితే నిమిషాల వ్యవధిలోనే జన్మిస్తారు. అయితే ఒక తల్లికి మాత్రం రెండో బిడ్డ పుట్టడానికి మూడు రోజుల టైం పట్టింది. ఇది చాలా అరుదైన ఘటన అని, ఇలా జరగడం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని డాక్టర్లు అంటున్నారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. కార్మెన్ మార్టినెజ్ అనే మహిళ గర్భం దాల్చింది.
కొంతకాలం తర్వాత ఆమె కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారని డాక్టర్లు గుర్తించారు. గత నెల 7వ తేదీన ఆమెకు డెలివరీ జరిగింది. అయితే ఒక్క పాప మాత్రమే పుట్టింది. ఈ పాప ఫొటోలు చూసిన కుటుంబ సభ్యులకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ‘అదేంటి? కార్మెన్ కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. ఒక్క పాపే పుట్టడం ఏంటి? రెండో పాపకు ఏమైంది?’ అని భయపడ్డారు.
అయితే తన కడుపులో ఉన్న రెండో పాప చాలా సంతోషంగా ఉన్నట్లు కార్మెన్ చెప్పింది. ‘‘ఇప్పుడు పొట్ట మొత్తం తనదే అని గంతులు వేస్తున్నట్లుంది’’ అంటూ పాప గురించి చెప్పింది. సరిగ్గా మూడు రోజుల తర్వాత రెండో పాప కూడా జన్మించింది. ఆ పాపకు ఇసబెల్లా అని పేరు పెట్టిన తల్లి.. పెద్ద పాపకు గాబ్రియెల్లా అని పేరు పెట్టింది.
ఒక పాప 24 వారాల నాలుగు రోజులకు పుట్టగా.. రెండో పాప సరిగ్గా 25 వారాలకు పుట్టిందని కార్మెన్ తెలిపింది. ఈ డెలివరీ చేసిన డాక్టర్.. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తన కెరీర్లో ఇలాంటి డెలివరీ చూడటం ఇది కేవలం రెండో సారి మాత్రమే అని చెప్పాడు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

