ఈటీవీ విన్ : ఫిబ్రవరి 20
తారాగణం : ప్రియా వడ్లమాని, గణాదిత్య, విజ్ఞయ్ అభిషేక్, బిందు నూతక్కి, శివనాథ్ యాచమనేని, శ్రీకాంత్ గుర్రం, జీవన్ ప్రియా రెడ్డి తదితరులు
దర్శకత్వం : తరుణ్ మహాదేవ్
ముక్కోణపు ప్రేమ కథలు భిన్నంగా సాగుతాయి. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం.. ఒక్కరినే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించడం.. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రేమదేశం.. బద్రి.. క్రిమినల్.. ఆర్య లాంటివి బ్లాక్‌బస్టర్ లిస్ట్‌లో చేరాయి. ఇక ఈ ట్రయాంగిల్ లవ్ ట్రాక్‌కు స్నేహం కూడా ముడిపడితే.. అదే ‘సమ్మేళనం’.
ఈటీవి విన్ వేదికగా, ఆరు ఎపిసోడ్లుగా వచ్చిన ఈ తెలుగు వెబ్ సిరీస్.. ప్రేక్షకుల ఆదరణతో హిట్ టాక్ సొంతం చేసుకున్నది. కథ విషయానికి వస్తే.. రామచంద్ర అలియాస్ రామ్ (గణాదిత్య) రచయిత. తన స్వీయ అనుభవాలకు అక్షరరూపం ఇస్తూ.. ఓ పుస్తకం రాస్తాడు. దానికి మంచి స్పందన రావడంతో.. అతని ఫొటోతోపాటు పుస్తకం గురించి కొన్ని సంగతులు ఓ న్యూస్ పేపర్లో ప్రచురితమవుతాయి.
ఆ ఆర్టికల్‌ను చూసి.. రామ్‌ను వెతుక్కుంటూ శ్రేయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విజ్ఞయ్ అభిషేక్), మేఘన (ప్రియా వడ్లమాని) వస్తారు. వీరంతా కొన్నాళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు. ఇక.. అర్జున్, రామ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. పెద్ద రచయిత కావాలనే లక్ష్యంతో ఉంటాడు రామ్. అందుకు అర్జున్ కూడా సపోర్ట్ చేస్తుంటాడు.
ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా.. తన ఆఫీసులో పరిచయమైన మేఘనతో అర్జున్ ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయినే రామ్ కూడా ప్రేమిస్తాడు. మరి.. మేఘన ఎవరిని ప్రేమించింది? ఆమె గతమేంటి? ఆమె జీవితంలో చార్లీ (శ్రీకాంత్ గుర్రం) పాత్ర ఏమిటి? ‘విలన్’ లేని ఈ ముక్కోణపు ప్రేమ కథలో.. ఒకరికొకరు ఎలా దూరం అయ్యారు? మళ్లీ ఎలా కలిశారు? చివరికి ఎవరెవరు ఒక్కటయ్యారు? అనేది తెలవాలంటే..
సిరీస్ చూడాల్సిందే!