e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home జిందగీ అవ్వల నగలే..అదుర్స్‌!

అవ్వల నగలే..అదుర్స్‌!

కాలచక్రంలో రుతువుల్లా .. ఫ్యాషన్‌ ప్రపంచంలోనూ ట్రెండ్స్‌ తిరిగి మళ్లీ వస్తుంటాయి. పాతవే కొత్తగా సొబగులద్దుకొని తళుకులీనుతుంటాయి. ఒంటి నిండా నగలు వేసుకోవడాన్ని సంప్రదాయంగా భావించేవాళ్లు ఒకప్పుడు. ఇప్పుడదే ఫ్యాషన్‌.ఆధునిక యువతులు సైతం సంప్రదాయ దుస్తులపై నఖశిఖం నగలే ధరిస్తున్నారు. ఇక పండుగలు, పెండ్లిళ్ల వంటి వేడుకల్లో అయితే, పాత నగలు అలంకరించుకొని కొత్తగా మురిసిపోతున్నారు.

అవ్వల నగలే..అదుర్స్‌!

కంటెలు, కడియాలు, కంకణాలు, వడ్డాణాలు, అరవంకీలు, చందమామలు, జడబిళ్ళలు… ఇవన్నీ ఒకప్పుడు అతివల అలంకరణలో చోటు దక్కించుకున్న ఆభరణాలే. కాలక్రమంలో కొత్త ఫ్యాషన్ల రాకతో.. కొన్ని నగలు మరుగున పడ్డాయి. వేసవి తర్వాత వానకాలం వచ్చినట్టు ఇప్పుడు పాత నగలన్నీ కొత్త హంగులు అద్దుకొని మెరుస్తున్నాయి. అమ్మమ్మలూ నానమ్మల కాలంలో ట్రెండీగా ఉన్న ఆభరణాలు, నేటి నాజూకు నగలకు దీటుగా ఫ్యాషన్‌ ప్రియులను అలరిస్తున్నాయి.

- Advertisement -

కంటె కళగా..
కంటె ప్రాచీనకాలం నుంచీ సంప్రదాయంగా వస్తున్న ఆభరణం. బంగారు కంటె శ్రీమంతురాండ్ల నగల డబ్బాలో తప్పక ఉండేది. నేటికీ కొందరు ఆదివాసీలు వెండి, రాగి, కంచు వంటి లోహాలతో చేసిన కంటెలను ధరిస్తున్నారు. అంతేకాదు, కొన్ని తెగల్లో పెండ్లికి గుర్తుగా ఆడవారి మెడలో కంటె వేస్తారు. ఇది అచ్చంగా కాళ్ళ కడియాల్లా మందంగా, దృఢంగా ఉంటుంది. పెండ్లినాడు ధరించే ఈ కంటెను జీవితాంతం ఉంచుకుంటారు చాలామంది. పాతకాలపు కంటె ఎలాంటి హంగులు లేకుండా సాదాసీదాగా ఉండేది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కంటెలు మాత్రం పచ్చలు, కెంపులతో మెరిసిపోతూ భారీ పెండెంట్లను కలిగి ఉంటున్నాయి. లక్ష్మీదేవి, రాధా కృష్ణులు, హంసలు, మయూరాలు, ఏనుగులు, పూలు.. ఒక్కటేమిటి రకరకాల లాకెట్లు కనువిందు చేస్తున్నాయి. ఇవి చీరలు, లంగావోణీలు, గాగ్రాచోళీల వంటి సంప్రదాయ వస్ర్తాలపైకి నప్పుతాయి.

అవ్వల నగలే..అదుర్స్‌!

జడ బిళ్ళలు..
ముచ్చటగా ముడిచిన కొప్పులో అందమైన చందమామలు, జడబిళ్ళలు అలంకరించుకోవడం అమ్మమ్మల నాటి ఫ్యాషన్‌. రానురాను వాటి స్థానాన్ని ప్లాస్టిక్‌, రబ్బర్‌ క్లిప్పులు, బ్యాండ్‌లు ఆక్రమించేశాయి. ఇప్పుడు వాటన్నిటినీ పక్కకు నెట్టి, పొడవాటి జడబిళ్లలు కొప్పులో చేరి కొత్త సోకులు పోతున్నాయి. రాళ్లు, రత్నాలు పొదిగిన బిళ్ళలు, గొలుసుల రూపంలో రకరకాల డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. పూసలు, గొలుసుల వంటి జడ కుచ్చులు కూడా వాలుజడల్లో వయ్యారంగా ఒదుగుతున్నాయి.

పాతవే కొత్తగా..
వంకీలు, పెద్ద ముక్కు పుడకలు, ముక్కు షేర్లు, పాపిట బిళ్ళలు, కాళ్ళ కడియాలు, చేతి కడియాలు, పొడవాటి హారాలు, నెక్లెస్‌లు.. ఇలా ఆపాదమస్తకం అలంకరించుకునే నగలన్నీ కొత్త సొబగులద్దుకుని తళుక్కుమంటున్నాయి. ‘జోధా అక్బర్‌’, ‘పద్మావత్‌’, ‘బాహుబలి’ వంటి చారిత్రక చిత్రాల్లో నిగనిగలాడిన సంప్రదాయ నగలపై ఈతరం మనసు పారేసుకుంటున్నది. ట్రెండ్‌ను గమనించిన డిజైనర్లూ ఆ పాత నగలకు కొత్త సొబగులు అద్దుతున్నారు.

అవ్వల నగలే..అదుర్స్‌!

వడ్డాణం వయ్యారంగా..
ప్రాచీన కాలంలో పండుగలు, పెండ్లిళ్ళ వంటి సంప్రదాయ వేడుకల్లో ధరించే చీరలు, లంగా వోణీలపై నాజూకైన నడుముకు బంధనంగా బంగారు, వెండి వడ్డాణాలను ధరించేవారు. రానురాను వడ్డాణం మరుగున పడింది. చాలా ఏండ్ల తర్వాత సన్నని గొలుసుల్లా మళ్లీ తెరపైకి వచ్చిన వడ్డాణాలిప్పుడు అన్ని వయసులవారి నగల్లో భాగమయ్యాయి. పలక రేకులాంటి వడ్డాణంపై ఇంపు కెంపులు, రాళ్లు, వజ్రాలను పొదిగి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. లేటెస్ట్‌ డిజైన్‌ వడ్డాణాలను నడుముకు చుట్టుకోవడమే కాదు, మెడలో హారంగానూ వేసుకోవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అవ్వల నగలే..అదుర్స్‌!
అవ్వల నగలే..అదుర్స్‌!
అవ్వల నగలే..అదుర్స్‌!

ట్రెండింగ్‌

Advertisement