భారతీయ మహిళల్లో ఊబకాయం సమస్య క్రమంగా పెరుగుతున్నది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. 15-49 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళల్లో దాదాపు 24 శాతం మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అంటే, దాదాపు ప్రతి నలుగురిలో ఒకరిని ఈ సమస్య వేధిస్తున్నది. అయితే, ఇది కేవలం బరువు సమస్య మాత్రమే కాదు.
ఆరోగ్యం, భావోద్వేగాలతోపాటు భవిష్యత్తు తరాలమీదా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఊబకాయంతో బాధపడే మహిళలను.. పీసీఓఎస్, వంధ్యత్వం, గర్భధారణ సమస్యలు, గర్భస్రావాలు, మధుమేహం లాంటి సమస్యలూ చుట్టుముడుతున్నాయి. ఇలాంటి సమయంలో జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఊబకాయం బారినుంచి బయటపడొచ్చు.