Hyacinth Saree | మామూలుగా గుర్రపుడెక్కను నీటి తెగులుగా భావిస్తారు. దానినే ఇప్పుడు చీరల తయారీకి ఉపయోగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ మహిళలకు గుర్రపుడెక్క చీరల తయారీ జీవనోపాధిని కల్పిస్తున్నది. ఆ దారాన్ని, నూలుతో కలిపి బెంగాల్లో ప్రసిద్ధమైన ‘తంత్’ చీరల్లో ఉపయోగిస్తున్నారు. ఆ ప్రక్రియలో ముందుగా నీళ్లలోంచి తీసిన గుర్రపుడెక్కను బాగా ఎండబెడతారు. పలుచటి పీచును వేరుచేసి.. దారంగా వడుకుతారు. ‘గుర్రపుడెక్క దారంతో ఈ ఏడాది కనీసం వెయ్యి చీరలను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అంటారు స్వచ్ఛతా పుకారే అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ) డైరెక్టర్ గౌరవ్ ఆనంద్. గుర్రపుడెక్క సేకరణ ద్వారా ఈ సంస్థ రెండొందల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది.
Read More :
“Sujani Embroidery | బిహారీ మహిళలు చేస్తున్న ఈ డిజైన్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ !!”
khada dupatta | ఒకప్పుడు మొఘల్ రాణులకే పరిమితమైన ఈ ఖాడా దుపట్టా గురించి తెలుసా”
“firaun | ఈ కశ్మీరీ ఫ్యాషన్ మొఘలాయిల నుంచి ట్రెండింగ్నే”