ఇష్టం లేని మగువలు ఉండరు. కానీ, ప్రతిసారీ మ్యాచింగ్ ఆభరణాలు బంగారంతో చేయించుకోవడం అందరికీ సాధ్యం కాదు కదా! అందుకే తయారీదారులు తక్కువ బంగారంతో కొత్తకొత్త నగలను అందుబాటులోకి తెస్తున్నారు. కొద్దిపాటి బంగారానికి పూసలు, ముత్యాలు, పగడాల లాంటి పూసల్ని జోడించి భారీ నగలను తయారు చేస్తున్నారు.
హారాలు, చోకర్లు, నెక్లెస్‌లు… ఒకటేమిటి అన్నిటికీ ఆధునిక రూపు తీసుకొస్తున్నారు. వీటిలో సింపుల్‌గా ఉండే డిజైన్లతోపాటు భారీ నగలు కూడా అందుబాటులో ఉన్నాయి. సందర్భానికి తగినట్లు ఎంచుకునే అవకాశం ఉండటంతో ఈతరం అమ్మాయిలకు ఇవి తెగ నచ్చేస్తున్నాయి. పూసల రంగులతో కలిపి మ్యాచింగ్ నగల్ని మేనేజ్ చేయొచ్చు కానీ, బంగారు గాజులు మాత్రం మ్యాచింగ్‌కి సరిపోయేలా వేసుకోవడం కష్టం. అలాంటి ఇబ్బంది లేకుండా బంగారు తొడుగు గాజులు వచ్చేశాయి. సన్నటి జాలీల్లా ఉండే ఈ తొడుగుల మధ్యలో కావాల్సిన రంగు గాజులను అమర్చుకుని రంగురంగుల బంగారు గాజులు వేసుకుని మెరిసిపోవచ్చు. సాధారణంగా గాజుల తయారీకి అవసరమయ్యే బంగారంతో పోలిస్తే వీటికి పట్టే పుత్తడి చాలా తక్కువ. ఈ తొడుగులను సొంతంగా ఎవరికి వారే అమర్చుకోవచ్చు. అంతేకాదు బంగారం కొనలేని వాళ్లకు ఇమిటేషన్, వన్‌గ్రామ్ గోల్డ్‌లోనూ ఈ తొడుగులు అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం.. మీరూ ఒకసారి ప్రయత్నించండి.