Neha Dhupia | బాలీవుడ్లో ఓ తరాన్ని ఉర్రూతలూగించిన నటి నేహా ధూపియా. అందంతో, అభినయంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఒకప్పుడు సన్నగా, నాజుగ్గా ఉండే నేహ.. ఇప్పుడు బొద్దుగా మారిపోయింది. ఆమె రూపం గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అయితే తన అందం, బరువు గురించి ఎవరు ఎలాంటి కామెంట్స్ పెట్టినా.. పెద్దగా పట్టించుకోవడం లేదు నేహ.
తన ప్లస్ సైజ్ గురించి వస్తున్న వార్తలు, కామెంట్లపై స్పందిస్తూ.. ‘నా బరువు గురించి ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా, వెక్కిరించినా నేను చాలా లైట్ తీసుకుంటున్నాను. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లిగా ఈ శరీరం నాకెంతో ప్రియమైనది. మొదటి కాన్పు తర్వాత కొంచెం బరువు పెరిగాను. మళ్లీ తీవ్రమైన కసరత్తులు చేసి తగ్గాను. రెండో కాన్పు తర్వాత మళ్లీ పెరిగాను. ఫిట్నెస్ను కాపాడుకోవడం నాకెంతో ఇష్టం. బరువు పెరిగినా నా శరీరం నాకెప్పుడూ అసౌకర్యంగా అనిపించలేదు. నా శరీరాన్ని ఎన్నటికీ ద్వేషించలేను. కారణం.. నా ప్రపంచంలోకి మరో ఇద్దరిని తీసుకొచ్చిన ఈ తనువును నేనెలా ద్వేషిస్తాను? ఇక నా బరువు గురించి ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరో చేసే కామెంట్లకు కుంగిపోయే ప్రసక్తే లేదు’ అని సుతిమెత్తగానే స్పందించింది.
Aadipurush | ఆదిపురుష్ గురించి డైరెక్టర్ హింట్ ఇచ్చేశాడా..?