Yo Yo Honey Singh | విడాకులు తీసుకున్న యో యో హనీసింగ్ జంట.. భరణంగా అన్ని కోట్లు ఇచ్చాడా?
Yo Yo Honey Singh Divorce | ఈ మధ్య కాలంలో సినీ రంగంలో ఎదో ఒక సెలబ్రెటీ జంట విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. సమంత, నాగచైతన్య విడాకుల నుండి ధనుష్, ఐశ్వర్యల వరకు చాలా మంది సెలబ్రెటీ కపుల్ ఈ మధ్య విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ జంట విడాకులను తీసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ర్యాపర్ యో యో హనీసింగ్ తాజాగా తన భార్య నుండి విడాకులు తీసుకున్నారు. ఈ జంట దాదాపు పదేళ్ళ వివాహా బంధానికి ముగింపు పలికారు. అయితే గతేడాది హనీసింగ్ భార్య షాలినీ తల్వార్ హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అంతేకాకుండా ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో గృహహింస నిరోధక చట్టం కింద దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే కోర్టు ఇరు వాదనలు విన్న తర్వాత విచారించి అనంతరం వీరికి విడాకులు మంజూరు చేసింది. భరణంగా హనీసింగ్ కోటీ రూపాయలను సమర్పిస్తున్నాడు. ముందుగా షాలినీ తల్వార్ భరణంగా రూ.10 కోట్లు డిమాండ్ చేసింది. అయితే చర్చల అనంతరం కోటీ రూపాయలకు ఇద్దరూ అంగీకరించారు. 2011లో వివాహా బంధంతో ఈ సెలబ్రెటీ జంట ఒకటయ్యారు. మధ్యలో మనస్పర్ధలు రావడంతే విడాకులు తీసుకున్నారు. కాగా ఈ జంటకు పిల్లలు లేరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

