పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి ఆదిపురుష్ (Aadipurush). తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా..కృతిసనన్ సీతగా కనిపించనుంది. 2023 జనవరి 12న ఆదిపురుష్ గ్రాండ్గా విడుదల కానుంది.
చాలా కాలం క్రితం మొదలైన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయలేదు మేకర్స్. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా పెద్ద సర్ప్రైజ్ ఉండనుందని ఓం రౌత్ మీడియాతో చెప్పడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు పోస్టర్ వస్తుందా..? అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఓం రౌత్ అప్డేట్ నేపథ్యంలో మేకర్స్ అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగానైనా ఫస్ట్ లుక్ను కచ్చితంగా లాంఛ్ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.
టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో వస్తున్న ఈ ప్రాజెక్టుకు సాచెట్-పరంపర మ్యూజిక్ డైరెక్టర్లు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో లంకేశ్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రభాస్ మరోవైపు సలార్, ప్రాజెక్టు కే చిత్రాల్లో నటిస్తుండగా..షూటింగ్ దశలో ఉన్నాయి.