అతనికి ఇతరుల శృంగార జీవితంపైనే ఆసక్తి.. బ్రహ్మస్త్ర ప్రొడ్యూసర్, డైరెక్టర్‌పై కంగనా ఫైర్
Kangana Ranaut on Brahmastra Director Ayan Mukerji | బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీని పొగిడేవారిని జైలులో పెట్టాలని కంగనా రనౌత్
Kangana Ranaut Comments on Brahmastra Director Ayan Mukerji | ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బ్రహ్మస్త్ర సినిమాపై, చిత్ర బృందంపై మండిపడింది. ఈ చిత్రం కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ. 600 కోట్లు బూడిద చేశాడని విమర్శించిన కంగనా.. అతన్ని మేధావి అని పొగిడే వ్యక్తులను తీసుకెళ్లి జైలులో పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రహ్మస్త్ర చెత్త సినిమా అంటూ పలువురు సినీ విశ్లేషకులు ఇచ్చిన రివ్యూ రేటింగ్లను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
దర్శకుడు అయాన్ ముఖర్జీని జీనియస్ అని మెచ్చుకుంటున్న వారందర్నీ జైలులో పెట్టాలి. బ్రహ్మస్త్ర సినిమా తీయడానికి అతనికి 12 ఏండ్లు పట్టింది. ఈ సినిమాను 400 రోజులకు పైగా షూటింగ్ జరపడమే కాకుండా ఆ సమయంలో 12 మంది సినిమాటోగ్రాఫర్లు, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చాడు. రూ.600 కోట్లను ప్రొడక్షన్ ఖర్చుల రూపంలో కాల్చి బూడిద చేశాడు. ఇలాంటి వ్యక్తిని మేధావి అని పిలవడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అంతటితో ఆగకుండా బ్రహ్మస్త్ర సినిమా నిర్మాత కరణ్ జోహార్ మీద కూడా కంగనా సీరియస్ అయ్యింది. తన సినిమాల కంటే కూడా ఇతరుల శృంగార జీవితాలపైనే కరణ్ జోహార్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాడని విమర్శించింది. తన సినిమాల కోసం రివ్యూలు, రేటింగ్స్, కలెక్షన్స్.. ఇలా ప్రతిదాన్ని కొనేస్తుంటాడు. అయితే ఈసారి మాత్రం హిందూయిజం, సౌత్ వేవ్‌ను వాడుకుంటున్నాడు. తన సినిమా కోసం టాలెంట్ ఉన్న నటీనటులు, స్క్రిప్ట్ రైటర్లు, డైరెక్టర్లను పెట్టుకోవడం మానేసి తమ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని దక్షిణాది నటులు, డైరెక్టర్లను అడుక్కుంటున్నాడు. ఇలా వారిని అడిగే బదులు టాలెంట్ ఉన్నవారితో సినిమాలు చేస్తే సరిపోతుంది కదా అంటూ ఘాటుగా విమర్శించింది.
Read More :
“Brahmastra | బ్రహ్మాస్త్ర ఎన్ని థియేటర్లలో విడుదలైందో తెలిస్తే షాకే..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

