Brahmstra Movie | ‘ధూమ్-3’ రికార్డును బ్రేక్ చేసిన ‘బ్రహ్మస్త్ర’.. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు
Brahmstra Movie Breaks Dhoom-3 Record | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘బ్రహ్మస్త్ర’ హవానే కనిపిస్తంది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదలైంది. రాజమౌళి ఈ చిత్రానికి తెలుగులో సమర్పకుడిగా వ్యవహరించాడు. నాగార్జున కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో కూడా భారీ అంచనాలతో విడుదలైంది. తాజాగా ఈ చిత్రం తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఒపెనింగ్స్ రాబట్టిన హిందీ సినిమాగా బ్రహ్మస్త్ర సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒపెనింగ్ డే రోజునే ఈ చిత్రం రూ. 6.2 కోట్లను గ్రాస్ కలెక్షన్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ముందు ధూమ్-3(4.70 కోట్లు) పేరిట ఉండేది. ఈ చిత్రానికి తెలుగులో రూ.5.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ శనివారంతో బ్రహ్మస్త్ర మూవీకి తెలుగులో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరో కలెక్షన్లకు సమనంగా బ్రహ్మస్త్ర కలెక్ట్ చేయడం విశేషం అనే చెప్పాలి.
మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. బిగ్‌బీ అమితాబ్, నాగార్జున కీలకపాత్రల్లో నటించగా మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

