సినీ లవర్స్ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలీవుడ్ (Bollywood) క్రేజీ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర (Brahmastra) ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. రణ్ బీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా మల్టీస్టారర్‌గా తెరకెక్కింది బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, నాగార్జున (Nagarjuna) కీ రోల్స్ చేశారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రివ్యూస్ వస్తున్నాయి. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన థియేటర్లకు సంబంధించిన వార్త ఒకటి ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బ్రహ్మాస్త్ర లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం వరల్డ్ వైడ్‌గా 8,913 థియేటర్లలో విడుదల కాగా..కేవలం ఇండియాలో 5,019 కాగా..ఓవర్సీస్లో ఈ ఫిగర్ 3,894గా ఉంది.
ఇటీవల కాలంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన బాలీవుడ్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ స్థాయిలో భారీ ఎత్తున విడుదలైన బ్రహ్మాస్త్ర మరి ఎలాంటి కలెక్షన్లు రాబట్టనుందనేది తెలియాలి. హిందీపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మూడు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Read Also : Hari Hara Veera Mallu | క్రిష్ సినిమాపై ఫోకస్..డేట్స్ కూడా ఇచ్చేసిన పవన్..!