Kathala Poti | వరాలిచ్చే తల్లి మహాలక్ష్మి.. శ్రీదేవి అనుగ్రహం కోసం ఆచరించేది వరలక్ష్మీ వ్రతం!. అక్షరాల్లో సలక్షణంగా తొణికిసలాడే ఆ కల్పవల్లి.. అందమైన కథల్లో మరింత సుందరంగా భాసిల్లుతుంది. ఈ కథల వ్రతంలో.. ఓ రచయితది చెలియలికట్ట దాటని ఆవేశం మరో కథకుడిది కట్టలు తెంచుకున్న ఆవేదన.. ఆలోచనలకు రెక్కలు తొడిగింది ఒకరైతే .. ఆప్యాయతలకు పెద్దపీట వేసింది మరొకరు!
ఈ పోటీ క్రతువులో.. అందరూ అందరే.. అక్షరాన్ని ఉపచారంగా ఎంచుకున్నవారే! భాషయాసలను నివేదనగా అర్పించినవారే!! అందుకే కాబోలు.. ఈ దఫా నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీలో కథలు వరాల జల్లుగా వర్షించాయి. పాఠకులను హర్షింపజేసేందుకు సిద్ధమయ్యాయి.
బుద్ధి వికసించేలా..మనసు పురివిప్పేలా.. తమ హృదిలోంచి కథలను ఆవిష్కరించిన రచయితలకు… వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో కథల పోటీ- 2023-24 విజేతల జాబితా ప్రకటిస్తున్నాం. వెల్లువలా వచ్చిన వందలాది కథలను విశ్లేషించి.. అనేక దశల్లో వడబోసి.. అత్యుత్తమ కథలను ఎంపిక చేయడం.. సమరమే! ఈ కథా క్రతువులో అండగా నిలిచిన న్యాయనిర్ణేతలకు.. ఈ పోటీకి కథలను పంపడం గౌరవంగా భావించిన రచయితలకు… కృతజ్ఞతలు. లక్ష్మీ కటాక్షం పొందిన చదువులతల్లి బిడ్డలకు అభినందనలు.
రూ॥ 50,000 గెలుపొందిన కథ
అమ్మ చిరునామా : డా. ఎం. కోటేశ్వర రావు
రూ॥ 25,000 గెలుపొందిన కథలు
ఇసుక తైలం : సమ్మెట ఉమాదేవి
ఒక మిలంతి కల : మల్లిపురం జగదీశ్