బతుకమ్మ పాటకు వీడియో చేయండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి
Bathukamma Festival 2022 | తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ. అడవిపూలే అమ్మవారుగా వెలసే అపురూప దృశ్యం బతుకమ్మలో ఆవిష్కృతం అవుతుంది. జానపద గీతాలే అష్టోత్తరాలుగా, అద్భుత స్తోత్రాలుగా బతుకమ్మ పాటల్లో వినిపిస్తాయి.
Bathukamma Festival 2022 | తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ. అడవిపూలే అమ్మవారుగా వెలసే అపురూప దృశ్యం బతుకమ్మలో ఆవిష్కృతం అవుతుంది. జానపద గీతాలే అష్టోత్తరాలుగా, అద్భుత స్తోత్రాలుగా బతుకమ్మ పాటల్లో వినిపిస్తాయి. ఆటపాటల మేళవింపు పల్లె తెలంగాణ ముచ్చటను విశ్వవ్యాప్తం చేసింది. ఈ సందడికి మరింత వన్నె తీసుకురావాలని సంకల్పించింది విశ్వసాహితీ ట్రస్ట్. కాబట్టే, బతుకమ్మ పాటకు పట్టంకడుతూ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’ ఈ మహత్కార్యంలో మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తున్నది
వర్షరుతువు వెళ్తూ వెళ్తూ ప్రకృతి మాతకు పూలసారె వాయనంగా ఇస్తుంది. శరన్నవరాత్రుల వేళకు ఆ పూలన్నీ బతుకమ్మగా రూపుదాల్చి ఊరూవాడా తెలంగాణ వైభవాన్ని చాటుతాయి. ప్రకృతి ప్రసాదించిన విరులను ఆపదలు తీర్చే దేవేరిగా తీర్చిదిద్ది పాటలతో అర్చిస్తారు ఆడపడుచులు. ఆ పాటలు తెలంగాణ జీవన వైచిత్రిని తెలియజేస్తాయి. చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తాయి. పౌరాణిక గాథలను విశదీకరిస్తాయి. సామాన్యుల కష్ట సుఖాలను ప్రతిధ్వనిస్తాయి. మొత్తంగా తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పాటలు అద్దం పడతాయి. కానీ కాలక్రమంలో ఆ పాటలు లయ తప్పుతున్నాయి. డీజే హోరులో పక్కదారి పడుతున్న జానపద గీతాలకు పూర్వవైభవం తీసుకురావాలన్నదే ఈ పోటీ లక్ష్యమని అంటున్నారు బుర్రా వెంకటేశం. పల్లె పదాలను ఈ తరం పిల్లలు వల్లె వేయాలనే సంకల్పంతో బతుకమ్మ పండుగ వేళ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బతుకమ్మ పాటను అచ్చంగా, స్వచ్ఛంగా వీడియో తీసి పంపితే చాలు. భిన్న రంగాల నిపుణులతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం విజేతలను ఎంపిక చేస్తుంది.
గునుగ పూవుల్లో గౌరమ్మవై..
ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ప్రాణంపోసిన ‘గునుగ పూవుల్లో గౌరమ్మవై ఇలలో’ బతుకమ్మ పాటకు అనుగుణంగా వీడియో కంపోజ్ చేసి, వీడియో షూట్ చేసి vishwasahithitrust@gmail.com ఈమెయిల్‌కు వీడియోను పంపాలి. అక్టోబర్ 4, 2022లోగా ఎంట్రీలను పంపాలి. ఇతర బతుకమ్మ పాటలను ఎంచుకునే స్వేచ్ఛ కూడా ఉంది. కాకపోతే, బుర్రా వెంకటేశం రచనను ఎంచుకున్నవారికి అదనంగా ఐదు మార్కులు జోడిస్తారు.
అందరి బతుకమ్మ
ఈ పోటీలో తెలంగాణ బిడ్డలే కాదు.. తెలంగాణేతరులు, ప్రవాసులు కూడా పాల్గొనవచ్చు. వయో పరిమితి లేదు. పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, డ్యాన్స్ గ్రూప్‌లు, ఇతర సంస్థలకూ ఇదే మా ఆహ్వానం.

బృందమే అందం..
డ్యాన్స్ వీడియోలో పాల్గొనేవారి కనీస సంఖ్య.. ఇరవై అయిదు. అంతకు తక్కువ ఉంటే.. ఆ వీడియోలను పోటీకి అనర్హమైనవిగా భావిస్తారు. గరిష్ఠంగా ఎంతమంది అయినా ఉండవచ్చు. ప్రతి గ్రూప్ ఎన్ని వీడియోలైనా పంపవచ్చు. కాకపోతే, ప్రతి వీడియోనూ ప్రత్యేకమైనదిగానే పరిగణిస్తారు. మార్కుల కేటాయింపు కూడా అలానే ఉంటుంది. అందిన వీడియోలను ‘విశ్వసాహితీ ట్రస్ట్ వీడియోస్’ అనే యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేస్తారు.
విశ్వసాహితి వేదికపైనే..
పోటీ కోసం పంపిన వీడియోలను విశ్వసాహితీ ట్రస్ట్ యూట్యూబ్ చానెల్లో కాకుండా ఏ ఇతర సోషల్ మీడియా చానెల్లోనూ అప్లోడ్ చేయరాదు. అలా చేస్తే పోటీకి అనర్హమైనవిగా ప్రకటిస్తారు. అంతేకాకుండా, భవిష్యత్తులో నిర్వహించే ఏ పోటీలోనూ పాల్గొనకుండా నిషేధం విధిస్తారు. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించే ఓ కార్యకమంలో విజేతలకు బహుమతులు అందిస్తారు. సంగీత, సాహిత్య, సినీ దిగ్గజాల సమక్షంలో ఎంపిక చేసిన వీడియోలను ప్రదర్శిస్తారు. ప్రదర్శనకు అర్హత సాధించిన వీడియోల రూపకర్తలకు శాలువా, మెమెంటో, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందిస్తారు.
వడపోత ఇలా..
ఎ. జడ్జీలు ఇచ్చే మార్కులు – 34
బి. ఆ వీడియోకు వచ్చిన వ్యూస్ – 33
సి. వీడియో ద్వారా సబ్‌స్ర్కైబర్స్ – 33 మార్కులు
.. మూడు విభాగాలూ కలిపి అత్యధిక మార్కులు సాధించిన వీడియోలకు బహుమతులను ప్రకటిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా.. ఇతర రాష్ర్టాల నుంచి పాల్గొనేవారికి రెండు మార్కులు, విదేశాల నుంచి పాల్గొనేవారికి ఐదు మార్కులు అదనంగా ఇస్తారు. వీరికి ప్రత్యేక విభాగాలూ ఉంటాయి. బుర్రా వెంకటేశం రచనను ఎంచుకున్నవారికి అదనంగా ఐదు మార్కులు జోడిస్తారు.
నిరంతర ప్రక్రియ..
ప్రతి రెండు నెలలకు ఒకసారి ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంతోపాటు పలువురు రచయితలు అక్షరీకరించిన అనుభూతి ప్రధానమైన ఒక పాటకు ఇలానే పోటీ నిర్వహిస్తారు. సకారాత్మక భావనలను, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేయడం విశ్వసాహితీ ట్రస్ట్ ఆశయం. మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు, మానవీయ విలువల్ని సుసంపన్నం చేసేందుకు, అనుబంధాలూ ఆత్మీయతలను మనసుల నిండా నింపేందుకు, నేటి తరాల హృదయానికి హత్తుకునేలా భారతీయతను పరిచయం చేసేందుకు గేయ సాహిత్యాన్ని మించిన మార్గం లేదు.
ఆధునికతను ఆహ్వానిద్దాం
ప్రాచీన విలువలను, సంప్రదాయాలను మరువకుండా కాపాడుకుందాం, భావితరాలకు మానవ సంబంధాలు అనే అమూల్యమైన నిధిని వారసత్వ సంపదగా అందజేద్దాం.
మరిన్ని వివరాలకు..
9951264662, 7981253517
FOLLOW US ON
INSTAGRAM- https://www.instagram.com/vishwasahithitrust/
FACEBOOK- https://www.facebook.com/vishwasahithitrust
TWITTER- <https://twitter.com/VishwaSahithi1>

బతుకమ్మ బతుకమ్మ..
1. గునుగ పూవుల్లో గౌరమ్మవై ఇలలో
తంగెడు పూవుల్లో మాతల్లివై ఇలలో
చామంతి పూవుల్లో చక్కని చుక్కల్లె ఇలలో
గుమ్మడి పూవుల్లో గుడిలో దేవతవై ఇలలో
బంతి పూవుల్లో పూబంతి వయ్యావు ఇలలో
వామ పూవుల్లో మా దేవతవయ్యావు ఇలలో
2. అడవి పూలకి అందల మిచ్చావు ఇలలో
ప్రకృతి ప్రతిబింబం నీవే అయ్యావు ఇలలో
అన్నదమ్ములు తెచ్చిన పువ్వుల్లో ఒదిగిపోయావు ఇలలో
ఆడపడుచుల ఆనందమయ్యావు ఇలలో
తొమ్మిది రోజుల్లో రోజొక్క తీరుగా ఇలలో
కొలువై ఉన్నావు కాంతల గుండెల్లో ఇలలో
3. ఎంగిలిపూల బతుకమ్మ ఒకటో రోజమ్మా ఇలలో
అటుకుల బతుకమ్మ రెండో రోజమ్మా ఇలలో
ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజమ్మా ఇలలో
నానబియ్యం బతుకమ్మ నాల్గో రోజమ్మా ఇలలో
అట్ల బియ్యం బతుకమ్మ ఐదో రోజమ్మా ఇలలో
అలిగిన బతుకమ్మ ఆరో రోజమ్మా ఇలలో
వేపకాయల బతుకమ్మ ఏడో రోజమ్మా ఇలలో
వెన్నెముద్దల బతుకమ్మ ఎనిమిదో రోజమ్మా ఇలలో
సద్దుల బతుకమ్మ తోమ్మిదో రోజమ్మా ఇలలో
4. చెరువులు చెలిమలు వాగులు, బావులు
వంకల్లో నిను చేర్చితిమమ్మ ఇలలో
ఆడబిడ్డల రక్షణకై నిలిచితివి ఇలలో
మహిళల మనసులో కొలువై ఉన్నావు ఇలలో
తెలంగాణ లోగిలిలో మహారాణివి ఇలలో
– బుర్రా వెంకటేశం, ఐ.ఏ.ఎస్
Read More :
Bathukamma festival | బతుకమ్మ పండుగను ఎనకట ఎట్ల జరుపుకునేటోళ్లం..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

