Rasika Dugal | మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్ర పోషించిన రసికా దుగ్గల్ ఇప్పుడు అందరికీ హాట్ ఫేవరేట్. 2007 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె.. మీర్జాపూర్ తర్వాత సెలెబ్రిటీ అయ్యింది. ఆమె నటించిన వెబ్‌సిరీస్ ‘లిటిల్ థామస్’ను మెల్బోర్న్లో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో ఈ నెల 19న ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా రసికా దుగ్గల్ మాట్లాడుతూ.. ‘ఎంత మంచి క్యారెక్టర్లు చేసినా చివర్లో ఏడుపు సీన్లు ఉండాల్సిందే. అలాంటి పాత్రలు చేసి చేసి నాకు బోర్ కొట్టేసింది. దర్శక నిర్మాతలు కూడా ఈ మధ్య కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. బహుశా వాళ్లకు కూడా నా ఏడుపు చూసి బోర్ కొట్టేసిందేమో! నాకంటూ కొత్త రోల్స్ ఇస్తున్నారు. అందుకు ఆనందంగా ఉంది.
ఓటీటీ వల్లే అది సాధ్యమైందని అనుకుంటున్నాను. ఎన్నో సినిమాల్లో నటించాను. మీర్జాపూర్ సిరీస్‌కు వచ్చినంత పేరు దేనికీ రాలేదు. ఈ సిరీస్‌తో బాగా పాపులారిటీ వచ్చింది. అప్పటినుంచి అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి’ అని చెప్పుకొచ్చింది రసికా దుగ్గల్.