కరోనా వైరస్ గాలిలోనూ ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందనీ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, బయటికి వెళ్లినప్పుడే కాకుండా, ఇంట్లోనూ మాస్క్ ధరించాలని వారు సూచిస్తున్నారు. అయితే, 24 గంటలూ మాస్క్ పెట్టుకోవడం కష్టమంటారా? మరీ అంత ఇబ్బందిగా ఉంటే, ప్రత్యేక సందర్భాల్లోనైనా కచ్చితంగా మాస్క్ ధరించాలి.