e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిందగీ సినిమా కోసం.. మార్షల్‌ ఆర్ట్స్‌!

సినిమా కోసం.. మార్షల్‌ ఆర్ట్స్‌!

సినిమా కోసం.. మార్షల్‌ ఆర్ట్స్‌!

‘ఎన్‌ఐఏ, రా ఏజెంట్స్‌ ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతుంటారు. కానీ, వారి దేశభక్తి గురించి ప్రపంచానికి తెలియదు. చరిత్రలో మరుగునపడిన అలాంటి గొప్ప వీరుల పాత్రను పోషించే అవకాశం నాకు రావడం గర్వంగా ఉంది’ అంటున్నది కథానాయిక సయామీ ఖేర్‌. ‘రేయ్‌’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ నాసిక్‌ సొగసరి ఆరేండ్ల తర్వాత ‘వైల్డ్‌డాగ్‌’తో తెలుగులో పునరాగమనం చేస్తున్నది. నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా సయామీ ఖేర్‌ పంచుకున్న కబుర్లు..
తెలుగు సినిమాలకు విరామం తీసుకున్నారెందుకు?
‘రేయ్‌’తో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆ చిత్రం విడుదలకు ముందే బాలీవుడ్‌లో అవకాశం వచ్చింది. రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా దర్శకత్వంలోని ‘మీరా’్జతో హిందీలో అరంగేట్రం చేశాను. ఆ తర్వాత రితేష్‌ దేశ్‌ముఖ్‌తో ఓ మరాఠీ సినిమాలో నటించా. హిందీలో మంచి ఆఫర్స్‌ రావడంతో ముంబయిలోనే ఉండిపోయా. మళ్లీ ఇన్నాళ్లకు ‘వైల్డ్‌డాగ్‌’తో టాలీవుడ్‌లో చేస్తున్నా.
ఈ అవకాశం ఎలా వచ్చింది?
నా సినిమాలు చూసిన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ ‘రా’ ఏజెంట్‌ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. యాక్షన్‌ ప్రధానంగా, చాలెంజింగ్‌గా సాగే క్యారెక్టర్‌ కావడంతో నేనూ అంగీకరించా.
నాగార్జునతో తొలి సినిమా? ఎలా అనిపించింది?
నాగార్జునతో సినిమా చేయాలని చాలా మంది నాయికలు కలలుకంటుంటారు. నేనూ అంతే. ఈ సినిమాతో అది నెరవేరింది. ‘గీతాంజలి’ అంటే నాకు చాలా ఇష్టం. నాగార్జున చాలా సింపుల్‌గా, అందరితో కలివిడిగా ఉంటారు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. ఈ సినిమాలో పాటలు లేకపోవడం కొంత బాధగానే అనిపిస్తున్నది. భవిష్యత్తులో నాగ్‌ సరసన డ్యూయెట్స్‌ ఉన్న సినిమాలు చేయాలనుంది.
యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ పాత్ర కోసం ఎలా సన్నద్ధ్దమయ్యారు?
చిన్నతనం నుంచీ నాకు క్రీడల్లో చక్కటి ప్రావీణ్యముంది. క్రికెట్‌ అంటే ఇష్టం. బ్యాడ్మింటన్‌, రన్నింగ్‌లో ప్రవేశముంది. అవన్నీ ఈ సినిమాకు ఎంతో ఉపయోగపడ్డాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో నెల రోజులు శిక్షణ తీసుకున్నా. సినిమాలో నాపై చాలా యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. షూటింగ్‌ టైమ్‌లో చాలాసార్లు గాయాలు కూడా అయ్యాయి. అవన్నీ నాకు మరచిపోలేని అనుభూతులుగా మిగిలాయి.
ఇందులో మీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
ఆర్యా పండిట్‌ అనే ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తా. నాగార్జున ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నటించారు. మేం ఓ ఆపరేషన్‌ కోసం కలిసి పనిచేయాల్సి వస్తుంది. అదేమిటన్నది తెరపై చూడాల్సిందే! దేశభక్తితో ముడిపడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది.
తెలుగులో మీకు నచ్చిన దర్శకులు, హీరోలు?
రాజమౌళి నాకు ఇష్టమైన దర్శకులు. అలాగే హీరోల్లో ప్రభాస్‌, అల్లు అర్జున్‌ నటన నచ్చుతుంది. ఔత్సాహిక దర్శకుల్లో తరుణ్‌ భాస్కర్‌ అంటే ఇష్టం. విజయ్‌ దేవరకొండతో ఆయన తెరకెక్కించిన ‘పెళ్లిచూపులు’ నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఆ సినిమా చూసి ‘మీతో కలిసి పనిచేయాలనుంది’ అని తరుణ్‌ భాస్కర్‌కు మెసేజ్‌ పెట్టాను.
తదుపరి సినిమాల విశేషాలు?
అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓటీటీ షో చేస్తున్నా. బాలీవుడ్‌లో మరో సినిమా అంగీకరించా. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా. రేయ్‌, మీర్జాతోపాటు నేను చేసిన సినిమా షూటింగ్‌లు ఎక్కువ టైమ్‌ తీసుకున్నాయి. అందుకే ఆరేండ్లలో ఐదు సినిమాలు మాత్రమే చేశా. నా కెరీర్‌లో వేగంగా పూర్తయిన సినిమా ఇదే.
హీరోయిన్లు యాక్షన్‌ సినిమాలు చేయడం సులభమేనా?
కథానాయికలు యాక్షన్‌ పాత్రల్లో కనిపించడం కొంత అరుదు. బేబీ, నామ్‌షబానా లాంటి సినిమాల్లో తాప్సీ యాక్షన్‌తో కూడిన క్యారెక్టర్స్‌ చేసింది. ఇదీ ఆ పాత్రలను పోలి ఉంటుంది. గతంలో నేను చేసిన ‘స్పెషల్‌ అప్స్‌’ అనే యాక్షన్‌ సిరీస్‌ ఈ క్యారెక్టర్‌కు సన్నద్ధ్దమయ్యేందుకు ఉపయోగపడింది. ఏంజిలినా జోలీ నటించిన ‘సాల్ట్‌’తోపాటు మరికొన్ని మహిళా ప్రధాన సినిమాలు చూసి బాడీలాంగ్వేజ్‌పై అవగాహన పెంచుకున్నా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సినిమా కోసం.. మార్షల్‌ ఆర్ట్స్‌!

ట్రెండింగ్‌

Advertisement