కాలమేదైనా.. కొందరిలో పాదాలు కంపు కొడుతుంటాయి. ముఖ్యంగా ప్రతిరోజూ బూట్లు తొడుక్కొనే వారిని ఈ సమస్య మరింత వేధిస్తుంది. కొందరు లైట్‌గా తీసుకున్నా.. కొన్ని సందర్భాల్లో ‘పాదాల దుర్వాసన’ అనేది పెద్ద సమస్యగా మారుతుంది. బాధితులను ఇబ్బంది పెట్టడమేకాకుండా.. చుట్టూ ఉన్నవారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని చిన్నచిన్న చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.