కావలసిన పదార్థాలు
ఖర్జూరాలు: ఒక కప్పు, నెయ్యి: అర కప్పు, డ్రైఫ్రూట్స్: పావు కప్పు, పాలు: అర కప్పు.
తయారీ విధానం
ఖర్జూరాల్లోని గింజలను తీసి ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లుపోసి అరగంటపాటు నానబెట్టాలి. నానిన ఖర్జూరాలను నీటితో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఖర్జూరాల పేస్ట్ వేసి సన్నని మంటపై ఐదు నిమిషాలు కలుపుతూ వేయించాలి. నీరంతా ఇగిరిపోయాక పాలు పోసి కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. బాగా దగ్గర పడిన మిశ్రమంలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి. చల్లారాక ముక్కలుగా కోసుకుంటే నోరూరించే ఖర్జూర హల్వా సిద్ధం.