Kajal Aggarwal and Nisha Aggarwal | దక్షిణాది వెండితెరకు కాజల్ అగర్వాల్ నవ్వు బంగారు మెరుగులు అద్దింది. ఆమె చెల్లె నిషా అగర్వాల్ కూడా కొన్నాళ్లు మెరిసి.. అంతలోనే మాయమైంది. పెండ్లి తర్వాత కుటుంబానికే పరిమితమైంది. ఈ ఇద్దరి ఆత్మీయతకు ఎల్లలు లేవు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు కాజల్, నిషా.
కాజల్ : మా ఇద్దరి మధ్య ఏడాదిన్నర తేడా ఉంది. చిన్నప్పటి నుంచీ నాకు చెల్లే అత్యంత సన్నిహితురాలు. మంచి సహచరి. తను తోబుట్టువు కావడం నా అదృష్టం.
నిషా : మా ఇద్దర్నీ చూసి కవలలు అనుకునేవారు. కలిసే చదువుకున్నాం. మంచి స్నేహితులం కూడా. ప్రతి ప్రయాణం కలిసే చేశాం. ప్రతీ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాం.
కాజల్ : మా ఇద్దరి లక్షణాలూ ఒకటే. కొనే వస్తువులో నాణ్యత చూస్తాం. మా ఇద్దరికీ ఒకే రకమైన ఓసీడీ ఉంది. ప్రతి పనినీ క్రమబద్ధంగా చేస్తాం. నిజాయతీని ఇష్టపడతాం. కాకపోతే నిషాకు నాకంటే ఓపిక ఎక్కువ. ఎవరికి ఏది ఇష్టమో మా ఇద్దరికి తప్పితే.. ఇంకెవరికీ తెలియదు.
నిషా : అక్క నా ఆత్మ. లక్ష్యాన్ని సాధించేవరకూ విశ్రమించదు. కష్టపడే స్వభావం తనది. మా నాన్న కొంచెం స్ట్రిక్ట్. ఇంట్లో తెలియకుండా మేం ఒక్కోసారి బయటికి వెళ్లేవాళ్లం. ‘మా ఇద్దరిలో ఎవరైనా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్తే.. రెండోవారు నిశ్శబ్దంగా తలుపు తీయాలనేది మా ఒప్పందం. ఒక్కోసారి నేను కావాలనే తలుపు తీసేదాన్ని కాదు. దీంతో నాన్న చేతిలో తిట్లు తినేది పాపం! (నవ్వుతూ..).
కాజల్ : టీనేజ్‌లో ఒకరోజు రాత్రి భయమేసింది. ఏడుపు వచ్చేసింది. నిషా ఒక్కమాట కూడా మాట్లాడకుండా నన్ను గట్టిగా కౌగిలించుకొని ఓదార్చింది. మళ్లీ నేను నిద్రపోయేవరకూ అలాగే తల నిమురుతూనే ఉంది.
Kajal Aggarwal | మెస్మరైజింగ్ లుక్‌లో కాజల్ అగర్వాల్ ఫొటోస్..”
“Kajal Aggarwal | రెడ్ కలర్ డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ బ్యూటిఫుల్ ఫొటో షూట్..”
Kajal Aggarwal | క్యూట్ లుక్స్‌తో అదరగొడుతున్న కాజల్ అగర్వాల్..”